స‌మంత కొడుతుంది.. న‌య‌నతార ప‌డుతుంది..!

స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి మ‌రీ రికార్డులు తిర‌గ‌రాస్తున్నారు న‌య‌న‌తార‌, స‌మంత. స్టార్ హీరోయిన్‌ల‌కు రికార్డులు తిర‌గ‌రాయ‌డం పెద్ద విష‌యం కాదు. అయితే ఇప్పుడు చివ‌రి నిమిషంలో స‌మంత రికార్డు న‌య‌న్ చేతినుండి చేజారింది. ఒక్క రోజు వ్య‌వ‌ధితో ఈ రికార్డ్ న‌య‌న్ నుంచి దూర‌మైపోయింది.

news18-telugu
Updated: August 30, 2018, 12:49 AM IST
స‌మంత కొడుతుంది.. న‌య‌నతార ప‌డుతుంది..!
సమంత నయన్ ఫైల్ పోటో
  • Share this:
అదేంటి.. వీళ్లిద్ద‌రికీ ఏమైంది కొట్టుకోడానికి..? అయినా ఇద్ద‌రి సినిమాలు ఒకేసారి కూడా రావ‌డం లేదు క‌దా.. మ‌ళ్లీ ఎందుకు కొట్టుకోవ‌డాలు అనుకుంటున్నారా..? అవును ఒకేసారి రావ‌డం లేదు కానీ ఇద్ద‌రూ ఇప్పుడు ఒకే రికార్డ్ కోసం మాత్రం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే వీళ్లిద్ద‌రి మ‌ధ్య‌లో పోటీకి తెర‌తీసింది. రికార్డులు అనేవి ఇండ‌స్ట్రీలో హీరోల‌కు మాత్ర‌మే ఉంటాయి. హీరోయిన్ల‌కు త‌క్కువ‌గా వ‌స్తాయి అనుకుంటారు. కానీ ఇప్పుడు హీరోయిన్‌లు తామేం త‌క్కువ కాదంటున్నారు.

nayanatara
నయనతార ట్విట్టర్ ఫోటోస్


స్టార్ హీరోల‌తో పోటీ ప‌డి మ‌రీ రికార్డులు తిర‌గ‌రాస్తున్నారు. అందులోనూ న‌య‌న‌తార‌, స‌మంత లాంటి స్టార్ హీరోయిన్‌ల‌కు రికార్డులు తిర‌గ‌రాయ‌డం పెద్ద విష‌యం కాదు. అయితే ఇప్పుడు చివ‌రి నిమిషంలో స‌మంత రికార్డు న‌య‌న్ చేతినుండి చేజారింది. ఒక్క రోజు వ్య‌వ‌ధితో ఈ రికార్డ్ న‌య‌న్ నుంచి దూర‌మైపోయింది. దాంతో ఇప్పుడు సోలోగా స‌మంత మాత్ర‌మే ఈ రికార్డ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ రికార్డును గ‌త మూడు ద‌శాబ్ధాల‌లో బాల‌య్య‌.. నాని మాత్ర‌మే అందుకున్నారు.

samantha
సమంత ట్విట్టర్ ఫోటోస్


ఇప్పుడు రెండు వారాల వ్య‌వ‌ధిలో న‌య‌న‌తార‌.. స‌మంత‌కు ఈ రికార్డ్ అందుకునే ఛాన్స్ వ‌చ్చినా కూడా అనుకోకుండా న‌య‌న్ చేజారి స‌మంత‌కు మాత్ర‌మే అందుతుంది ఈ రికార్డ్. అదే ఒక్క‌రోజు రెండు సినిమాల‌తో రావ‌డం. ఆగ‌స్ట్ 30న న‌య‌న‌తార న‌టించిన "ఇమైక్క నోడిగ‌ల్" విడుద‌ల కానుంది. ఆగ‌స్ట్ 17న "కోకో"తో వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టిన ఈ భామ‌.. రెండువారాల త‌ర్వాత మ‌రో సినిమాతో వ‌స్తుంది. ఇక ఆగ‌స్ట్ 31న తెలుగులో "కోకో" విడుద‌ల కానుంది. అంటే ఒక్కరోజు గ్యాప్ లో రెండు సినిమాలు విడుద‌ల చేస్తుంది న‌య‌న‌తార‌.

Samantha
సమంత (ఫైల్ ఫోటో)


స‌మంత మాత్రం సెప్టెంబ‌ర్ 13న తెలుగు, త‌మిళ్లో "యు ట‌ర్న్".. "సీమ‌రాజా" సినిమాల‌తో వ‌స్తుంది. గ‌తంలో ఇలా ఒక్క‌రోజే రెండు సినిమాల‌తో వ‌చ్చింది బాల‌య్య‌.. నాని మాత్ర‌మే. "బంగారు బుల్లోడు", "నిప్పుర‌వ్వ" సినిమాల‌తో బాల‌య్య 1994లో వ‌స్తే.. 2015లో నాని "జెండా పై క‌పిరాజు", "ఎవ‌డే సుబ్రమ‌ణ్యం" సినిమాల‌తో వ‌చ్చాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు స‌మంత ఈ రికార్డ్ అందుకుంటుంది. మ‌రోవైపు న‌య‌న్ మాత్రం తృటిలో ఈ అద్భుత‌మైన రికార్డ్ మిస్ అయిపోయింది.
Published by: Praveen Kumar Vadla
First published: August 29, 2018, 5:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading