సమంత... తగ్గేదేలే అంటూ వరుసగా సినిమాలపై సినిమాలు చేస్తూ బిజీగా మారింది. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత సినిమాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తనకు ఎలాంటి పాత్ర వచ్చినా చేసేందుకు సిద్దమైపోతుంది. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ ఇలా వరుసగా తెలుగు,తమిళ్, హిందీ సినిమాలతో సమంత ఫుల్ బిజీగా మారింది.ఇటీవలే విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ పుష్పలో సమంత ఐటెం సాంగ్‌తో చేసిన అందాల ప్రదర్శన గురించి అందరికీ తెలిసిందే, అటు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో కూడా సమంత బోల్డ్ షో పై అందరూ చర్చించుకున్నారు.
అయితే తాజాగా మరోసారి సమంత అందాల ఆరబోతకు సిద్ధమవుతోంది. ఊ అంటావా అంటూ పుష్పతో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసిన సమంత పుష్ప 2లో కూడా మరో ఐటెం సాంగ్ చేస్తుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే ఈసారి తెలుగులో కూడా తమిళ్ హీరో సినిమాలో ఈ భామ... అందాలతో కనువిందు చేయనుంది. ప్రముఖ తమిళ్ హీరో మూవీలో హాట్ హాట్ అందాలతో ఫ్యాన్స్‌కు పండగ చేసేందుకు రెడీ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే... త్వరలో రాబోతున్న తమిళ మల్టీ స్టారర్ మూవీ కాతువాకుల రెండు కాదల్ సినిమా లో కూడా సమంత అందాల ఆరబోత పీక్స్ లో ఉంటుందని సమాచారం. సామ్.. బోల్డ్ లుక్ తో అభిమానులకు పండగ చేయబోతున్నట్లుగా తాజాగా విడుదల అయిన పోస్టర్ లు, పాటను చూస్తేంటే అందరికీ అర్థం అవుతుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత లు హీరోయిన్లుగా నటిస్తోన్నారు.
Get Ready for a glimpse of #TwoTwoTwo #KaathuVaakulaRenduKaadhal
A @VigneshShivN Directorial
An @anirudhofficial Musical#KRKOnApril28 #Anirudh25 #Nayanthara @Samanthaprabhu2 @7screenstudio @Rowdy_Pictures @RedGiantMovies_ @SonyMusicSouth @proyuvraaj @teamaimpr pic.twitter.com/Cc2hxI90de
— VijaySethupathi (@VijaySethuOffl) April 9, 2022
దీంతో కాతువాకుల రెండు కాదల్ సినిమా గురించి ఇప్పుడు సోషల్‌లో మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. తాజాగా విడుదలైన పోస్టర్లో నయనతార పద్దతైన చీర కట్టులో కనిపిస్తూ ఉండగా సమంత మాత్రం చాలా మోడ్రన్ డ్రెస్సులో అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను ప్రేమిస్తాడు. అందులో చివరికి ఎవరితో ఆయన సెటిల్ అవుతాడు అనేది సినిమా కథ అయ్యి ఉంటుంది. నయనతార ప్రియుడు అయిన విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈనెల 28న ఈ సినిమాను తమిళంలో రిలీజ్ కానుంది. తెలుగు లో కూడా విడుదల చేయాలని హీరోయిన్స్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అనిరుథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రైలర్, టీజర్ చూసిన అభిమానులు ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood Cinema, Samantha Ruth Prabhu, Samantha twitter, Tollywood news, Vijay Sethupathi