అక్కినేని నాగ చైతన్య ఈరోజు తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. చైతూ 1986 నవంబర్ 23న జన్మించాడు. కాగా దిల్ రాజు నిర్మాణంలో 2009లో వచ్చిన జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయమైయాడు చైతు. అయితే మొదట్లో సరైన హిట్ లేక కొంత తడబడ్డ.. సమంతతో చేసిన 'ఏమాయ చేశావే' చిత్రంతో మొదటి హిట్ అందుకున్నాడు నాగచైతన్య. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 100% లవ్ మూవీ చైతూకి యూత్‌లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు అనుకున్నంతగా అలరించలేకపోయాయి. కాగా సమంతతో పెళ్లైన తర్వాత మొదటిసారిగా నటించిన మజిలీ చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు చైతన్య. ప్రస్తుతం చైతు మామ వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ అనే చిత్రం చేస్తున్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అది అలా ఉంటే పుట్టిన రోజు సందర్బంగా సమంత ఎమోషనల్ అవుతూ.. ఓ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది.
ఆమె తన పోస్ట్‌లో రాస్తూ.. చైతూకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు తన హ్యపినెస్ కోసం సమంత ప్రార్ధనలు చేస్తున్నాని, చైతూ రోజురోజుకు ఎదుగుతున్నాడని ఐలవ్‌యూ డార్లింగ్ అని తన పోస్ట్‌లో రాసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.