గోవాలో సమంత కొత్త ఇల్లు... అందుకేనా..

సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది.

news18-telugu
Updated: January 18, 2020, 12:25 PM IST
గోవాలో సమంత కొత్త ఇల్లు... అందుకేనా..
Instagram/samantharuthprabhuoffl
  • Share this:
సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతున్నారు. దీనికి కారణం ఈ భామ నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఆ మధ్య భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ హిట్ సినిమా '96' రీమేక్‌ జానులో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్దమవుతోంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అది అలా ఉంటే స‌మంత జ‌రుపుకునే సెల‌బ్రేషన్స్ అన్నింటికీ గోవా వేదిక‌గా మారుతోంది. రీసెంట్‌గా కూడా భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి గోవా వెళ్లింది. గోవాతో అనుబంధం పెంచుకోవాలని సమంత అక్కడే బీచ్‌కి ద‌గ్గ‌ర కొంత స్థ‌లాన్ని కోనుగోలు చేసింద‌ని తెలుస్తోంది. అంతేకాదు ఈ స్థ‌లంలో ఓ అందమైన ఇంటిని కూడా నిర్మించాల‌నేదే స‌మంత ఆలోచ‌న‌ట‌.
అదిరిన శ్రద్ధా కపూర్ లేటెస్ట్ హాట్ ఫోటో ‌షూట్..


First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు