హోమ్ /వార్తలు /సినిమా /

Samantha - Jr NTR: ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి స్మాల్ స్క్రీన్ పై సామ్..

Samantha - Jr NTR: ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి స్మాల్ స్క్రీన్ పై సామ్..

ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో సమంత (Twitter/Photo)

ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో సమంత (Twitter/Photo)

Samantha : ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి స్మాల్ స్క్రీన్ పై సామ్ సందడి చేసింది. 

  Samantha : ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో సమంత.. విడాకుల తర్వాత తొలిసారి స్మాల్ స్క్రీన్ పై సామ్ సందడి చేసింది. సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. అయితే ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. మరో ఐదు రోజుల్లో తమ వివాహానికి నాలుగేళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇరువురు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తాజాగా తమ వివాహా వార్షికోత్సవం సందర్భంగా సమంత.. తన భర్త నాగ చైతన్యపై ఓ పోస్ట్ చేసి ఎమోషనల్ అయింది.

  విడాకుల తర్వాత వారు సోషల్‌ మీడియాలో సమంత పెడుతున్న పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఇక అది అలా ఉంటే సమంత విడాకుల తర్వాత ముంబైకి షిఫ్ట్ కానుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదంతా ఏమి లేదని తెలుస్తోంది. ఆమె ముంబైకి వెళ్లట్లేదని తాజా టాక్. సమంత హైదరాబాద్‌లోనే ఉండనుందట. ఆమె గచ్చిబౌళిలో ఖరీదైన ఫ్లాటును కొన్నట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

  Gopichand - Aaradugula Bullet : ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీతో గోపీచంద్ ముందున్న టార్గెట్ ఎంత..

  ఆ సంగతి పక్కన పెడితే.. సమంత ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ఈ ప్రోగ్రామ్ దీపావళి కానుకగా ప్రసారం కానుంది. ఈ షోలో సమంత దాదాపు రూ. 25 లక్షల వరకు ప్రైజ్ మనీ గెలిచినట్టు సమాచారం. దాన్ని సమంత ఓ ఛారిటీకి అందజేసారు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షోలో ఇప్పటికే మహేష్ బాబు పార్టిసిపేట్ చేశారు. ఈయన ఈ షోలో రూ. 25 లక్షలు గెలిచారు. ఈ షోలో విజయ దశమి కానుగా ప్రసారం కానుంది.

  Super Star Krishna : సూపర్ స్టార్ ఇంట్లో ఘనంగా మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలు.. హాజరైన కుటుంబ సభ్యులు..

  ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

  Mahesh Babu - Namrata : చాలా యేళ్ల తర్వాత భార్య నమ్రతతో మహేష్ బాబు ఫోటో షూట్.. వైరల్ అవుతున్న పిక్స్..

  ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు.

  Venkatesh Multistarers : అబ్బాయి రానా సహా వెంకటేష్ ఇతర హీరోలతో చేసిన మల్టీస్టారర్ మూవీస్ ఇవే..

  ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

  Hit Movie Remake Bollywood: అధికారికంగా ప్రారంభమైన ’హిట్’ హిందీ రీమేక్.. బాలీవుడ్‌లో సౌత్ సినిమాల హంగామా..

  ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Jr ntr, NTR Evaru Meelo Koteeswarulu, Samantha Ruth Prabhu, Tollywood

  ఉత్తమ కథలు