సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ సమంత (Samantha) ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంది. నాగ చైతన్యతో (Naga Chaitanya) విడాకుల తర్వాత వరుస పెట్టి బిగ్ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ ఫుల్ బిజీ అయింది. తన పాత్ర పరిధి నచ్చితే చాలు వెంటనే ఓకే చేస్తున్న సామ్.. తాజాగా తన తమిళ హిట్ పెయిర్‌తో మరో సినిమాకు కమిటైందని సమాచారం. తమిళ స్టార్ హీరో విజయ్‌తో (Vijay) కలిసి మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతోందట సమంత. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసి సమంతను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఇవన్నీ పక్కనబెడితే విజయ్‌తో మూవీ అనే సరికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సమంత.
ప్రస్తుతం దళపతి విజయ్ (Thalapathy Vijay) తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రెండో షెడ్యూల్ షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ తదుపరి సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ 66 పూర్తి కాకముందే తన 67వ సినిమాను లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓకే చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తూనే నటీనటుల వేట ప్రారంభించిందట చిత్రయూనిట్. ఇందులో భాగంగా సమంతను సంప్రదించి హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విజయ్- సమంత జోడీ తేరి (పోలీసోడు), మెర్సెల్ (అదిరింది), కత్తి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలో మరోసారి విజయ్- సమంత కలిసి ఓకే తెరపై సందడి చేయబోతున్నారనే వార్త ఇరువురి ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొల్పింది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుందట.
ఇదిలా ఉంటే మరోవైపు సమంత పలు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన శాకుంతలం సినిమా ఇప్పటికే కంప్లీట్ చేసుకోగా.. యశోద సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అదేవిధంగా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది సామ్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్ కన్ఫమ్ చేశారు. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero vijay, Samantha Ruth Prabhu, Tollywood