Home /News /movies /

SAMANTHA NAYANTHARA AND VIJAY SETHUPATHI KAATHUVAAKULA RENDU KAADHAL SHOOT BEGINS TODAY HERE ARE THE DETAILS SR

Samantha-Nayanthara : ఒకే సినిమాలో ముగ్గురు సూపర్ స్టార్స్.. నేడే షూటింగ్ ప్రారంభం..

నయనతార, సమంత, విజయ్ సేతుపతి, విఘ్నేష్ Photo : Twitter

నయనతార, సమంత, విజయ్ సేతుపతి, విఘ్నేష్ Photo : Twitter

Samantha-Nayanthara : దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు లేడి సూపర్ స్టార్స్ నయనతార, సమంత మొదటిసారి కలిసి ఓ సినిమా కోసం నటిస్తున్నారు.

  దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు లేడి సూపర్ స్టార్స్ నయనతార, సమంత మొదటిసారి కలిసి ఓ సినిమా కోసం నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం పేరు ‘కాతువాకుల రేండు కాదల్’. ఈ చిత్రానికి దర్శకుడు విఘ్నేష్ శివన్. అంతేకాదు ఈయన లేడీ సూపర్ స్టార్ నయనతార బాయ్ ఫ్రెండ్ కూడా. ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారం నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుకానుంది. ఇక దాదాపు ఒక సంవత్సరం తర్వాత సమంత సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇక సమంత విషయానికి వస్తే.. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన సమంత. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న సమంత ఆహా ఓటీటీలో ఓ టాక్ షో చేస్తోంది. సామ్ జామ్ పేరుతో వస్తోన్న ఈ షోలో టాలీవుడ్ ప్రముఖులను సమంత తనదైన స్టైల్‌లో ఇంటర్వూ చేస్తూ.. క్యూట్ క్యూట్ మాటలతో అలరిస్తోంది. ఓ వైపు ఆ టాక్ షోను నిర్వహిస్తూనే.. సమంత ఈ సినిమా షూటింగ్‌లో పాల్గననుంది. ఇక ఆమె ఆ మధ్య శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత సమంత ఏ తెలుగు సినిమాలోను కనిపించలేదు.

  ఇక సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సమంత తన తదుపరి తెలుగు చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది.  సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుందట. ఈ సంస్థ సమంతతో హర్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమాని ప్లాన్‌ చేసింది. ఈ చిత్రానికి తొలుత శరవణ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించాల్సి ఉండగా.. కొన్ని కారణాలు ఆయన ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందబోయే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపు పూర్తయ్యాయట.

  ఇక నయనతార విషయానికి వస్తే... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి తెలుగువారికి పరిచయం అయ్యింది నయన్. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్  సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  ఈ నేపథ్యంలోనే  నయన్ తాజాగా తమిళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. దీని పేరు 'నెట్రిక్కన్' (మూడో కన్ను). ఈ చిత్రాన్ని ఆమె ప్రియుడు, కాబోయే భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తుండగా.. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇది నయనతార నటిస్తున్న 65వ సినిమా.  ఈ నెట్రికన్‌ను తెలుగులో కూడా దీనిని రిలీజ్ చేయనున్నారు. ఇక ఆమె నటించిన ‘మూకుత్తి అమ్మన్‌’ అనే మరో సినిమా ఇటీవల హాట్ స్టార్‌లో విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఆర్జే బాలాజీ, ఎన్‌జే శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Nayanthara, Samantha, Vijay Sethupathi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు