HOME »NEWS »MOVIE »samantha nandini reddy film update naga chaitanya will be seen in a key role sr

Samantha-Naga Chaitanya : మరోసారి నాగ చైతన్యతో సమంత.. ఆ మ్యాజిక్ రిపీట్ కానుందా..

Samantha-Naga Chaitanya : మరోసారి నాగ చైతన్యతో సమంత.. ఆ మ్యాజిక్ రిపీట్ కానుందా..
నాగ చైతన్య, సమంత Photo : Twitter

Samantha-Naga Chaitanya : సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ తాజా సినిమాలో నాగ చైతన్య ఓ కీ రోల్‌లో కనిపించనున్నాడట.

  • Share this:
    అక్కినేని సమంత.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుండి నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది సమంత. ఇక తన మొదటి హీరో నాగచైతన్య నే వివాహం చేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత లేటెస్ట్ సినిమా జాను. తమిళ సినిమా 96కు తెలుగు రీమేక్‌గా వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలై పెద్దగా అలరించలేకపోయింది. అయినా.. 'జాను'లో సమంత నటన మంచి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాగ చైతన్య ఓ కీ రోల్‌లో కనిపించనున్నాడట. చైతూ.. ఓ బేబీ చిత్రంలో కూడా స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    ఇక ఈ సినిమా కన్నడ సినిమా దియాకు రీమేక్‌గా రానుందని తెలుస్తోంది. దియాను చూసిన సమంత.. ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌కు ఫిదా అయ్యిందట. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనీ చూస్తోందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉండగా.. ఒక హీరోగా నాగ చైతన్య చేస్తున్నాడని టాక్ వినిపడుతోంది.   గతంలో ఈ సమంత, చైతూ కలిసి నటించిన చాలావరకు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరి అభిమానులు ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనుంది చిత్రబృందం.

    Published by:Suresh Rachamalla
    First published:August 27, 2020, 07:32 IST

    टॉप स्टोरीज