హోమ్ /వార్తలు /సినిమా /

Samantha - Naga Chaitanya : సమంత, నాగ చైతన్య బాటలో విడాకులు తీసుకున్న మరో స్టార్ హీరో..

Samantha - Naga Chaitanya : సమంత, నాగ చైతన్య బాటలో విడాకులు తీసుకున్న మరో స్టార్ హీరో..

Samantha - Naga Chaitanya : సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చారు.

Samantha - Naga Chaitanya : సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చారు.

Samantha - Naga Chaitanya : సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. తాజాగా మరో స్టార్ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చారు.

  Samantha - Naga Chaitanya : సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జ‌రుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే వేగంగా జ‌రిగిపోతున్నాయి. కొంద‌రు మాత్రం అలాగే ద‌శాబ్ధాల పాటు క‌లిసుంటున్నారు కానీ మ‌రికొంద‌రు మాత్రం కొన్నేళ్ల‌కే విడిపోతున్నారు. ఈ యేడాది నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించి సంచలనం రేపారు. వీళ్లు డైవోర్స్ ప్రకటన కంటే ముందు సమంత.. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఇంటి పేరైన అక్కినేని తొలిగించింది. అప్పటి నుంచే నాగ చైతన్య, సమంతకు చెడిందా అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సమంత.. నాగ చైతన్యతో  తన స్నేహుతురాలితో కలిసి విహార యాత్రలకు కలిసి వెళ్లడం ఈ విడాకుల మ్యాటర్‌కు మరింత బలం చేకూరింది. ఇక అక్టోబర్ 2న వీరి 4వ వివాహా వార్షికోత్సవం  కంటే ముందు విడాకులు తీసుకుంటున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

  ఇక విడాకులు తర్వాత వీళ్లిద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. మధ్యలో నాగ చైతన్య, సమంత వారి జీవిత భాగస్వాములపై ఇన్‌డైరెక్ట్‌గా మాటల తూటాలు పేల్చుకున్నారు. వీళ్ల కంటే ముందు ఈ  యేడాది ఆమీర్ ఖాన్.. తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇవ్వడం పెద్ద చర్చనీయాంశం అయింది. తాజాగా విడాకులు తీసుకున్న సెలబ్రిటిలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ చేరారు.

  విడాకులు తీసుకున్న ఆర్నాల్డ్ (Twitter/Photo)

  ఈయన తన భార్య మరియా శ్రివర్‌కు ఎట్టకేలకు విడాకులు ఇచ్చారు. వీళ్లిద్దరు 10 యేళ్ల  క్రితం విడాకులకు అప్లై చేసుకుంటే.. ఎట్టకేలకు వీళ్లిద్దరి విడాకులకు స్థానిక కోర్టు మంజూరు చేసింది. వీళ్లిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన ఫైనల్ సెటిల్‌మెంట్ పూర్తైయింది.

  Balakrishna - Gopichand Malineni : బాలకృష్ణ, గోపిచంద్ మలినేని సినిమాలో విలన్‌గా అల్లు అర్జున్ ఫాదర్..


  ఈ విషయాన్ని యూఎస్ జర్నలిస్ట్ పత్రిక వెల్లడించింది. దీంతో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, మరియా శ్రివర్ 35 యేళ్ల వైవాహిక బంధానికి విడాకులతో పులిస్టాప్ పడింది. ఆర్నాల్డ్ భార్య యూఎస్ మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీకి మేనకోడలు అవుతోంది. ఇక ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే కదా. 1986లో పెళ్లి చేసుకున్న ఆర్నాల్డ్, మరియాకు నలుగురు సంతానం.

  Tollywood Top Movies 2021 : అఖండ,వకీల్ సాబ్,పుష్ప సహా 2021లో టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు..

  ఆర్నాల్డ్ విషయానికొస్తే.. 1970లో హెర్కులస్ ఇన్ న్యూయార్క్‌గా ఎంపికయ్యారు. బాడీ బిల్డర్‌గా ఉంటూనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌లో మొదట్లో ఒకటి రెండు సినిమాల్లో సాధారణ పాత్రల్లో నటించారు. ఇక టెర్మినేటర్‌ ఈయన కెరీర్‌లో వెరీ స్పెషల్. ఈ తర్వాత ఈ సిరీస్‌లో తెరకెక్కిన  ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించిన గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో వచ్చిన ఫేమ్‌తో అమెరికాలోని  కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు.

  First published:

  Tags: Arnold Schwarzenegger, Hollywood, Naga Chaitanya Akkineni, Samantha Ruth Prabhu, Tollywood

  ఉత్తమ కథలు