SAMANTHA NAGA CHAITANYA BOX OFFICE CLASHES WITH YASHODA NAGA CHAITANYA LAAL SINGH CHADDHA AND BROTHER IN LAW AKHIL AGENT MOVIES HERE ARE THE DETAILS TA
Samantha - Naga Chaitanya : మాజీ భర్త నాగ చైతన్యకు మరిది అఖిల్‌కు బాక్సాఫీస్ దగ్గర పోటీ ఇస్తోన్న సమంత..
నాగ చైతన్య,అఖిల్, సమంత (File/Photo)
Samantha - Naga Chaitanya - Akhil : నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత తొలిసారి వీళ్లిద్దరు తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
Samantha - Naga Chaitanya - Akhil : మాజీ భర్త నాగ చైతన్యకు మరిది అఖిల్‌కు బాక్సాఫీస్ దగ్గర పోటీ ఇస్తోన్న సమంత. వివరాల్లోకి వెళితే.. విడాకుల తర్వాత నాగ చైతన్య, అఖిల్‌లకు తొలిసారి బాక్సాఫీస్ దగ్గర సవాల్ విసిరింది సమంత. చైతూతో విడాకుల తర్వాత సమంత తన సినిమాల విషయంలో దూకుడు పెంచింది. వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. ఒకదాని తర్వాత మరోకటి ప్యాన్ ఇండియా సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. సామ్ విషయానికొస్తే.. తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఆ తర్వాత చైతూకు విడాకులు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాల విషయంలో సామ్ స్పీడ్ పెంచింది. అంతేకాదు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో సత్తా చూపెడుతోంది. ముఖ్యంగా సమంత.. కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు ఓకే చెప్తున్నారు. ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు.
ఆ చిత్రమే 'యశోద'. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమాను ఆగష్టు 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ విడుదల తేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘యశోద’ మూవీ ఒక రోజు ముందు నాగ చైతన్య, హిందీ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌తో నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’ బాలీవుడ్ మూవీ ఒక రోజు ముందు ఆగష్టు 11న విడుదలవుతోంది. మరోవైపు సామ్ ‘యశోద’ విడుదల రోజునే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్’ మూవీ కూడా విడుదల కానుంది. ఈ రకంగా తన సినిమాలతో ఏకంగా ఓ వైపు తన మాజీ భర్త నాగ చైతన్యతో పాటు మరిది ‘అఖిల్’కు ఏకంగా బాక్సాఫీస్ దగ్గర సవాల్ విసిరింది. ఇక ఈ మూడు సినిమాలు డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కినవే. ఈ రకంగా విడాకుల తర్వాత సమంత.. తన సినిమాలతో అక్కినేని హీరోలకు బాక్సాఫీస్ సవాల్ విసరడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా సమంత తన సినిమాలను నాగ చైతన్య, అఖిల్ సినిమాలకు పోటీగా విడుదల చేస్తుందా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.