• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAMANTHA MAY NOT BE PART OF NTR TRIVIKRAM FILM DUE TO AKKINENI NAGARJUNA AK

సమంత ఆ పని చేస్తే... నాగార్జునకు అవమానమే..

సమంత ఆ పని చేస్తే... నాగార్జునకు అవమానమే..

నాగార్జున, సమంత ఫైల్ ఫోటో

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న 'అయిననూ పోయి రావలె హస్తినకు' సినిమాలో సమంత నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి.

  • Share this:
    పెళ్లి తరువాత గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తున్న సమంత... మళ్లీ అలాంటి పాత్రలు పోషించేందుకు సిద్ధమవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే నయా మూవీలో ఆమె నటించబోతోందనే ప్రచారం కూడా సాగుతోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరితోనూ సమంత అనేక సినిమాలు చేసింది. ఎన్టీఆర్‌తో బృందావనం, జనతా గ్యారేజ్, రభస, రామయ్యా వస్తావయ్య సినిమాల్లో నటించిన సామ్... త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది, అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో యాక్ట్ చేసింది.

    తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న 'అయిననూ పోయి రావలె హస్తినకు' సినిమాలో సమంత నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన న్యూస్‌లో క్లారిటీ లేకపోయినా... ఈ మూవీలో సమంత నటిస్తే నాగార్జునకు అవమానం తప్పదనే గుసగుసలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. నాగార్జునకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మధ్య మన్మధుడు 2 సమయంలో విభేదాలు వచ్చాయి. అందుకే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో త్రివిక్రమ్ పేరు ఎత్తలేదు నాగ్. మన్మధుడు సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్‌ను మన్మధుడు 2 సినిమా విషయంలోనూ సాయం చేయాలని నాగ్ కోరాడని... అయినా త్రివిక్రమ్ నో చెప్పాడని సమాచారం.

    అప్పటి నుంచి వీరి మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ ఉంది. అలా తన మామతో విభేదాలు ఉన్న త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సమంత నటిస్తుందా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ సమంత అలా చేస్తే అది కచ్చితంగా నాగార్జునకు అవమానమే అనే చర్చ కూడా సినీవర్గాల్లో జరుగుతోంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి మామూలే అనే వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో నిజంగానే సమంత నటిస్తే... నాగ్, త్రివిక్రమ్ మధ్య ఉన్న విభేదాలు కూడా సమసిపోయినట్టే భావించాల్సి ఉంటుందనే వాదన వినిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: