Home /News /movies /

SAMANTHA MARRIAGE AND ENGAGEMENT SAREE SPECIALITY AND PRICE SU

Samantha Marriage Saree Special: పెళ్లిలో సమంత ధరించిన చీర ఎవరిదంటే..? చైతు ఫ్యామిలీకి అది చాలా స్పెషల్..

సమంత

సమంత

సమంత, నాగచైతన్యలు విడిపోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిగింది, ఆ వేడుక విశేషాలమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

    సమంత, నాగచైతన్యలు((Naga Chaitanya)  విడిపోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిగింది, ఆ వేడుక విశేషాలమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. నాగ చైతన్య, సమంత తొలిసారిగా.. 2009లో ఏ మాయ చేసావే (Yeh Maaya Chesave) చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులు వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. దీంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో నటించారు. అయితే 2015లో నాగ చైతన్య బర్త్‌ డే రోజు విష్ చేస్తూ సమంత (Samantha) చేసిన ట్వీట్.. వారి మధ్య ఏదో ఉందనే ప్రచారానికి తెర తీసింది. ఆ ట్వీట్‌లో సమంత.. నా అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొంది. ఇందుకు చైతన్య.. సామ్ ముద్దు పేరు పాపా ను పేర్కొంటూ రిప్లై ఇచ్చాడు.

    ఇక, కొంతకాలం సమంత, నాగ చైతన్య రిలేషన్ గురించి ప్రచారం జరిగింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో వాళ్లు కలిసి కనిపించడంతో.. ఆ ప్రచారానికి బలం చేకూరింది. చివరకు తాము ప్రేమలో ఉన్నట్టుగా చైతన్య, సమంతలు అంగీకరించారు. ఈ విషయం చైతన్య ఇంట్లో మొదట తన తండ్రి నాగార్జునకు చెప్పినట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో.. చైతన్య, సమంతలు.. 2017లో గోవాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకన్నారు.



    Samantha - Naga Chaitanya: సమంత, చైతన్యల పదేళ్ల ప్రేమ.. వైరల్ అవుతున్న ఆ 10 ఫొటోలు

    అయితే నిశ్చితార్థం, పెళ్లి, రిసెప్షన్.. ఇలా ప్రతి వేడుకలో సమంత, చైతన్య ధరించిన వస్త్రాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ముఖ్యంగా నిశ్చితార్థం, పెళ్లి వేడుకల్లో సమంత ధరించిన చీరల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిశ్చితార్థం రోజున సమంత కట్టుకున్న చీరను ప్రముఖ డిజైనర్‌ క్రేశా బజాజ్‌ రూపొందించారు. నాగచైతన్యతో పరిచయమైనప్పట్నుంచి, పెళ్లికి తొలి అడుగు నిశ్చితార్థం వరకూ వారి మధ్య జరిగిన అందమైన అనుభూతులను బొమ్మల రూపంలో చీరపై డిజైన్ చేశారు.



    Naga Chaitanya Samantha Divorce : నాగ చైతన్య, సమంత విడాకులపై నాగార్జున ఫస్ట్ రియాక్షన్ ఇదే..

    పెళ్లికి కూడా క్రేశా బజాజ్‌.. ప్రత్యేకంగా చీర, లెహంగాలను డిజైన్ చేశారు. అయితే పెళ్లి వేడుకలో సమంత ధరించిన చీర.. చైతన్య అమ్మమ్మ దగ్గుబాటి రాజేశ్వరిది. అంటే రామనాయుడి భార్యది. ఆ చీరను రీ మోడలింగ్ చేసి.. పెళ్లిలో సమంత ధరించింది. ఇందుకోసం రూ. 40 లక్షల వరకు ఖర్చు అయిందని టాక్. మరోవైపు పెళ్లి వేడుకలో సమంత ధరించిన జ్యూవెల్లరీకి సంబంధించి కూడా అప్పట్లో తెగ చర్చ జరిగింది. వీటి కోసం బాగానే ఖర్చు చేశారు. తన పెళ్లికి సంబంధించి క్రేశాను పూర్తిగా నమ్మినట్టుగా సమంత గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Naga Chaitanya Akkineni, Naga Chaitanya Samantha Divorce, Samantha

    తదుపరి వార్తలు