Samantha Akkineni : సమంత.. ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఆమె నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమాతో పాటు సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'ఓ బేబీ' కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం సమంత దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ హీరోగా తమిళ రీమేక్ '96'లో నటిస్తోంది. ఈ సినిమా ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. సమంత మరోవైపు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే 'ది ఫ్యామిలీ మ్యాన్'లో సమంత మరో కీలక పాత్రలో అలరించనుందని టాక్. ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ మంచి టాక్‌ను సంపాదించుకుంది. ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ మొదటి సీజన్‌లో అదరగొట్టారు. రెండవ సీజన్ షూటింగ్ కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ షూటింగ్‌లో సమంత పాల్గొంటోందని తెలుస్తోంది.
View this post on Instagram
అది అలా సమంత ఓ అదిరిపోయే పిక్‌ను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో బ్లాక్ కళ్లద్ధాలతో సూపర్ స్టైలీష్‌గా అదరగొడుతోంది. దీంతో నెటిజన్స్ ఆ పిక్‌పై తెగ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఈ లుక్ కొంపదీసి అమెజాన్ ప్రైమ్ సిరీస్‌లో సమంత లుక్ ఏమోనని డిస్కస్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆ లుక్‌లో సమంత మాత్రం కేక పుట్టిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.