హోమ్ /వార్తలు /సినిమా /

Samantha:మంత్రి కేటీఆర్ పోస్టుకు లైక్ కొట్టిన సమంత..!

Samantha:మంత్రి కేటీఆర్ పోస్టుకు లైక్ కొట్టిన సమంత..!

Photo Twitter

Photo Twitter

కేటీఆర్ బీజేపీని, మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీనికి సమంత లైక్ కొట్టడంతో ఇప్పుడు అది చర్చనీయాంశం అయ్యింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. చేతినిండా సినిమాలతో ఈ బ్యూటీ.. వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా సామ్.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన అనేక విషయాల్ని సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌కు షేర్ చేస్తుంటుంది. ఇక సెలబ్రిటీలు పెట్టిన పోస్టులకు కూడా సమంత రెస్పాండ్ అవుతుంటుంది. తాజాగా మరోసారి సమంత హాట్  టాపిక్‌గా మారింది.

ఇన్స్టాగ్రామ్ లోతెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ఒక పోస్ట్ కు ఆమె లైక్ కొట్టింది. దీంతో ఇప్పుడు కేటీఆర్ చేసిన ఆ పోస్టు ఏంటని.. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు. అయితే కేటీఆర్ తాజాగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ  పోస్ట్ చేశారు. ఇన్స్టాలో కేటీఆర్ పోస్ట్ చూస్తే... 'దేశ జనాభాలో కేవలం 2.5 శాతం జనాభా మాత్రమే ఉండే తెలంగాణ... దేశ జీడీపీలో 5 శాతాన్ని అందిస్తోంది. (సోర్స్: ఆర్బీఐ రిపోర్ట్ అక్టోబర్ 2021). ఈ దేశానికి కావాల్సింది డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కాదు. డబుల్ ఫలితాలను ఇచ్చే పాలన' అని ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కు సమంత లైక్ కొట్టింది.

సమంతతో పాటు అనేకమంది కేటీఆర్ చేసిన పోస్టుపై లైకులు కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్‌ ఫైర్ అంటూ కొందరు అభిమానులు పోస్టు చేస్తుంటూ.. మరికొందరు నెటిజన్లు రాష్ట్రంలో ఆర్టీసీ రేట్లను డబుల్ చేశారంటూ విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన కేసు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ గవర్న్ మెంట్ కేవలం బీజేపా పాలనలో ఉన్న రాష్ట్రాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

View this post on Instagram


A post shared by KTR (@ktrtrs)ఇక సమంత విషయానికి వస్తే.. ఆమె తెలంగాణ చేనేతకు సమంత బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో సైతం దూసుకుపోతోంది. వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యేందుకు యత్నిస్తోంది. మోస్ట్ పాప్యులర్ పాన్ ఇండియా హీరోయిన్ గా ఓ సర్వేలో సమంత టాప్ పొజిషన్ లో నిలిచింది.

First published:

Tags: Instagram, KTR, Samantha Ruth Prabhu

ఉత్తమ కథలు