హోమ్ /వార్తలు /సినిమా /

Samantha - Kangana: కంగనాను ఆకాశానేకి ఎత్తేసిన సమంత.. తలైవి పై అక్కినేని కోడలు ప్రశంసల జల్లు..

Samantha - Kangana: కంగనాను ఆకాశానేకి ఎత్తేసిన సమంత.. తలైవి పై అక్కినేని కోడలు ప్రశంసల జల్లు..

కంగనాను మెచ్చుకున్న సమంత (Twitter/Photo)

కంగనాను మెచ్చుకున్న సమంత (Twitter/Photo)

Samantha - Kangana: ముచ్చటగా మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన కంగనాను ఆకాశానేకి ఎత్తేసింది సమంత. అంతేకాదు కంగనా నటనలో కాదు.. నిజ జీవితంలో ఎంతో ధైర్యవంతురాలు అని కొనియాడింది. వివరాల్లోకి వెళితే..

  Samantha - Kangana: ముచ్చటగా మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన కంగనాను ఆకాశానేకి ఎత్తేసింది సమంత. అంతేకాదు కంగనా నటనలో కాదు.. నిజ జీవితంలో ఎంతో ధైర్యవంతురాలు అని కొనియాడింది. వివరాల్లోకి వెళితే..  నిన్న కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఈమె నటించిన ‘తలైవి’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. జయలలిత మళ్లీ దిగొచ్చి నటించిందా అనే రేంజ్‌లో కంగనా తన నటనతో జయలలిత పాత్రకు ప్రాణం పోసిందనే మాటలు వినబడుతున్నాయి. అంతేకాదు  ఇంకొంత మంది 2021 జాతీయ ఉత్తమ నటి అవార్డు మరోసారి కంగనాకే అంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. అంతలా జయలలిత పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది అంటూ  కంగనా నటనను మెచ్చుకుంటున్నారు. మరోవైపు జయలలితలా కంగనా కూడా రియల్ లైఫ్‌లో ఎంతో డేరింగ్ అండ్ డాషింగ్.

  ‘తలైవి’   ట్రైలర్‌లో కంగనా నటనకు విమర్శకులు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో అక్కినేని కోడలు సమంత కూడా చేరింది. ‘తలైవి’ ట్రైలర్ అద్భుతమంటూ కొనియాడింది. మా జనరేషన్‌లో అత్యంత ధైర్యవంతురాలివి. మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అంటూ కంగనాను ఆకాశానికి ఎత్తేసింది. అంతేకాదు తలైవి ట్రైలర్ చూసిన తర్వాత ఆమె ఫ్యాన్‌ లిస్టులో నేను చేరిపోయాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.

  అంతేకాదు డైరెక్టర్ ఏ.ఎల్. విజయ్ దర్శకత్వ పటిమను కొనియాడింది. అంతేకాదు థియేటర్‌లో తలైవి మ్యాజిక్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేసింది. 2019లో కంగనా నటించిన ‘మణికర్ణిక’ సినిమా చూసి మెచ్చుకుంది సమంత. ఇక కంగనా రనౌత్ నటించిన ‘తలైవి’ సినిమాను ఏప్రిల్ 23న తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ,మలయాళం భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. మరి ఈ మూవీతో కంగనా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Kangana Ranaut, Kollywood, Samantha akkineni, Thalaivi, Tollywood

  ఉత్తమ కథలు