హోమ్ /వార్తలు /సినిమా /

IMDb 2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్: లిస్టులో సమంత.. ఆమె ఫీలింగ్స్ చూస్తే!

IMDb 2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్: లిస్టులో సమంత.. ఆమె ఫీలింగ్స్ చూస్తే!

 Samantha News18

Samantha News18

Samantha Ruth Prabhu: IMDb 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించారు. ఈ లిస్టులో టాలీవుడ్ కి సంబంధించి రామ్ చరణ్, jr ఎన్టీఆర్, సమంత, అల్లు అర్జున్ చోటు సంపాదించడం విశేషం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

IMDb 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించారు. గ్లోబల్ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush) IMDb జాబితాలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల అగ్రస్థానంలో ఉండగా, ఆలియా భట్ (Alia Bhatt) ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ (Ram Charan), సమంత (Samantha) నిలవడం విశేషం.

IMDB ఇంటర్నెట్ డాటాబేస్ సంబంధించిన వాళ్లు 2022 సంవత్సరానికి గాను ఇండియా వైడ్ అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్స్ లిస్ట్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల మిలియన్ల IMDb కస్టమర్‌ల పేజీ వీక్షణల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందించారు. IMDb యొక్క 200 మిలియన్ల కంటే ఎక్కువ ఉన్న నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా నిర్ణయిస్తుంది. ది గ్రే మ్యాన్ మరియు తిరుచిత్రంబలం వంటి బహుభాషా చిత్రాల విజయవంతమైన విడుదలలతో అభిమానుల ఆసక్తిని పెంచి ధనుష్ ఈ సంవత్సరంలో అగ్రస్థానం పొందారు.

IMDb ప్రకారం 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల లిస్ట్ మీ కోసం..

1. ధనుష్

2. అలియా భట్

3. ఐశ్వర్య రాయ్ బచ్చన్

4. రామ్ చరణ్

5. సమంతా రూత్ ప్రభు

6. హృతిక్ రోషన్

7. కియారా అద్వానీ

8. ఎన్.టి. రామారావు జూనియర్

9. అల్లు అర్జున్

10. యష్

IMDb 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 భారతీయ తారల లిస్టులో టాలీవుడ్ కి సంబంధించి రామ్ చరణ్ , jr ఎన్టీఆర్ , సమంత , అల్లు అర్జున్ చోటు సంపాదించడం విశేషం. ఈ టాప్ 10 జాబితాలో తనకు చోటు దక్కడంపై సమంత స్పందించింది. లవ్ గుర్తు ఎమోజీ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన ఫీలింగ్స్ బయటపెట్టింది సమంత. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తారలకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక సినిమా RRRతో రామ్ చరణ్, jr ఎన్టీఆర్ క్రేజ్ ఎల్లలు దాటింది. పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీతో IMDb 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 భారతీయ తారల లిస్టులో చోటు సంపాదించారు ఈ ఇద్దరు స్టార్ హీరోలు. లేడీ ఓరియెంటెడ్ సినిమా యశోదతో మరోసారి సమంత టాలెంట్ బయటపడింది.

First published:

Tags: Allu Arjun, Jr ntr, Ram Charan, Samantha Ruth Prabhu

ఉత్తమ కథలు