దిల్ రాజుకు షాకిచ్చిన జాను.. పవన్ సినిమా పరిస్థితి ఎలా ఉండనుందో..

Jaanu  : సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ రీమేక్ 'జాను' దిల్ రాజుకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆయన మరో రీమేక్‌ను పవన్ కళ్యాణ్‌తో చేస్తున్నారు..

news18-telugu
Updated: February 17, 2020, 8:43 AM IST
దిల్ రాజుకు షాకిచ్చిన జాను.. పవన్ సినిమా పరిస్థితి ఎలా ఉండనుందో..
జానులో సమంత, శర్వానంద్ Photo ; Twitter
  • Share this:
Jaanu  : సమంత, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'జాను'. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన 96కు రీమేక్‌గా వచ్చింది. అక్కడ త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించారు. ఈ సినిమా అక్కడి ప్రజల్నీ తెగ ఆకట్టుకుంది. అదే మ్యాజిక్ రిపీట్ అయ్యిందనుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు జానును నిర్మించాడు. తమిళ 96ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాను కూడా దర్శకత్వం వహించాడు. అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రచారం కూడా అదిరిపోయిన జాను ఫిబ్రవరి 7న విడుదలైంది. సమంత క్రేజ్, శర్వానంద్ ఇమేజ్ తోడవ్వడంతో మంచి అంచనాల మధ్య విడుదలైన 'జాను' మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. జాను సినిమాలో కావాల్సినంత సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. దీనికి తోడు సమంత, శర్వానంద్ ఆ సీన్స్‌లో అదరగొట్టారు. సంగీతం కూడా మంచిగానే కుదిరింది. అయినా సినిమాను చూడాటానికి ప్రేక్షకులు కరువైయ్యారు. ఈ చిత్రానికి మొత్తం 21 కోట్లకు బిజినెస్ కాగా ఇప్పటి వరకు 6 నుండి 7 కోట్ల రూపాయల షేర్‌ను మాత్రమే రాబట్టినట్టు తెలుస్తుంది. దీనితో ఈ చిత్రానికి ఎలా లేదన్నా 70 శాతం వరకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి కారణం ఈ సినిమా చాలా మందికి తెలిసి ఉండడం, అలాగే ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్‌ను చూసెయ్యడం, ఇంకో ప్రధాన విషయం జాను కథ అందరికి అప్పీల్ కాకపోవడం, ఈ సినిమా కొంతమంది ఆడియెన్స్‌కు మాత్రమే రీచ్ అయ్యింది. కథ కూడా అలాంటిదే. దీంతో మాస్ ప్రేక్షకుల్నీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఎంతో ముచ్చట పడి, ఎంతో ప్రేమతో నిర్మించిన మొదటి రీమేక్ జాను దిల్ రాజు‌కు షాక్ ఇచ్చింది.

Samantha Jaanu going to be disaster for dil raju,Samantha Jaanu First Day Collections,samantha,jaanu trailer,samantha in jaanu,samantha jaanu movie,jaanu teaser,jaanu first day first show review,jaanu first day collections,jaanu review,samantha jaanu trailer,jaanu first day collection,jaanu public talk,samantha new movie,samantha akkineni,jaanu movie,jaanu public response,jaanu movie public review,sharwanand samantha jaanu first look,jaanu public review,jaanu,jaanu movie public talk,pawan pink remake,dil raju film with pawan,
జానులో శర్వానంద్, సమంత Twitter

ఆయన పవన్ కళ్యాణ్‌తో మరో రీమేక్ చేస్తున్నాడు. ఇదీ అందరికి చేరువయ్యే కథ మాత్రం కాదు. కొంతమందికే అప్పీల్ అవుతుంది. మోస్లీ మల్టీఫ్లెక్స్ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. మహిళల వేధింపులపై వస్తోన్న ఈ సినిమా హిందీతో పాటు తమిళ్‌‌లో కూడా వచ్చింది. చాలా వరకు ఆడియెన్స్ ఈసినిమాను చూసే ఉంటారు. దిల్ రాజుకు మొదటి రీమేక్‌ గట్టి షాకే ఇచ్చింది. మరీ ఇది ఎలా ఉండనుందో... పవన్ మాస్ ఇమేజ్ సినిమా ఓపెనింగ్స్‌కు ఉపయోగపడినా.. సినిమాలో పవన్ రెమ్యూనరేషన్ ఓ రేంజ్‌లో ఉండడంతో అంత బిజినెస్ చేస్తుందా.. బిజినెస్ చేసినా అన్ని కలెక్షన్స్ వస్తాయా.. కాస్ట్ ఫెల్యూర్‌గా మిగిలిపోనుందా.. మరో అజ్ఞాతవాసి కానుందా.. అని విశ్లేషిస్తున్నారు సినీ పండితులు. చూడాలి మరీ.. ఈ సినిమా ఫలితం ఎలా ఉండనుందో..

Samantha Jaanu going to be disaster for dil raju,Samantha Jaanu First Day Collections,samantha,jaanu trailer,samantha in jaanu,samantha jaanu movie,jaanu teaser,jaanu first day first show review,jaanu first day collections,jaanu review,samantha jaanu trailer,jaanu first day collection,jaanu public talk,samantha new movie,samantha akkineni,jaanu movie,jaanu public response,jaanu movie public review,sharwanand samantha jaanu first look,jaanu public review,jaanu,jaanu movie public talk,pawan pink remake,dil raju film with pawan,
Twitter

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు