Jaanu First Day Collections : సమంత జాను తొలిరోజు వసూళ్లు ఎంతంటే..

Samantha Jaanu First Day Collections : తమిళ సినిమా 96ను తెలుగులో సమంత, శర్వానంద్ జంటగా జాను పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 8, 2020, 2:14 PM IST
Jaanu First Day Collections : సమంత జాను తొలిరోజు వసూళ్లు ఎంతంటే..
Twitter
  • Share this:
Jaanu First Day Collections : త్రిష, విజయ్ సేతుపతి జంటగా తమిళ్‌లో నటించిన సినిమా 96ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. జాను ఫిబ్రవరి 7న విడుదలైంది. తమిళ 96ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాను కూడా దర్శకత్వం వహించాడు.  శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. దీంతో మంచి అంచనాల మధ్య నిన్న విడుదలైన 'జాను' పాజీటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమాలో సెంటిమెంట్ సీన్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. చాలా మందీ వీక్షకులు తమ చిన్న నాటి సంగతుల్నీ గుర్తు చేసుకుంటున్నారని.. కొన్ని సన్నివేశాల్నీ చూస్తూ చెమ్మగిల్లుతున్నారట. అంతలా ఆకట్టుకుంటోంది ఈ సినిమా. ఈ సినిమాలో శర్వానంద్, సమంత ఒకరిని మించి ఒకరు సెంటిమెంట్ సీన్లలో అదరగొట్టారు. సమంత జానుగా ఇరగదీసిందనే చెప్పాలి. ఈ సినిమాకు మరో హైలెట్ సంగీతం. తమిళ మాతృకకు సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకు కూడా సంగీతాన్నిఅందించాడు. దీంతో తమిళ సినిమా చూసిన ఫీల్ వస్తోంది. అదే మ్యాజిక్ కూడా రీపిట్ అయ్యిందనే చెప్పోచ్చు. నిన్న విడుదలైన జాను చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు డీసెంట్ వసూళ్లు దక్కించుకుంది. ఆంధ్రా, తెలంగాణాలలో కలిపి ఈ చిత్రం మొదటిరోజు రెండు కోట్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ రివ్యూస్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువ వసూళ్లే అని చెప్పుకోవాలి. దీనికి తోడు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా గొప్పగా లేవు.

Samantha Jaanu First Day Collections,samantha,jaanu trailer,samantha in jaanu,samantha jaanu movie,jaanu teaser,jaanu first day first show review,jaanu first day collections,jaanu review,samantha jaanu trailer,jaanu first day collection,jaanu public talk,samantha new movie,samantha akkineni,jaanu movie,jaanu public response,jaanu movie public review,sharwanand samantha jaanu first look,jaanu public review,jaanu,jaanu movie public talk
Twitter


అయితే సినిమాలో మేటర్ ఉంది కాబట్టి మౌత్ టాక్‌తో ముందు ముందు కలెక్షన్స్ పుంజుకొనే అవకాశం మెండుగా ఉంది. అందులో భాగంగా ఈ వీకెండ్ శని, ఆది వారాలలో ఈ చిత్ర వసూళ్లు కొంత మెరుగయ్యే అవకాశం ఉంది.


First published: February 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు