హోమ్ /వార్తలు /సినిమా /

తెలుగు సినిమాలకు సమంత బైబై.. కారణం అదేనా..

తెలుగు సినిమాలకు సమంత బైబై.. కారణం అదేనా..

సమంత Photo : Twitter

సమంత Photo : Twitter

ప్రస్తుతం సమంత ఏ తెలుగు సినిమాను చేయట్లేదు.. అయితే ఈ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.

Samantha : సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. అలా పోయిన సంవత్సరం సమంత అదరగొట్టిన ఈ సంవత్సరంలో సమంత మొదటి సినిమా ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పొచ్చు. శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు సమంత ఓ రియాలిటీ షోకు జడ్జ్‌గా  చేయనున్నదని సమాచారం. అది అలా ఉంటే సమంత తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్నఓ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందని సమాచారం.

సమంత అక్కినేని (Instagram/samantharuthprabhuoffl)
సమంత అక్కినేని (Instagram/samantharuthprabhuoffl)

ఈ చిత్రానికి  అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి జరుగుతుంది. ఇది కేవలం హారర్ చిత్రమే కాదనీ, అంతకు మించిన విషయమున్న చిత్రమని సమంత పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది రూపొందుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే సమంత ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమాను ఓకే చేసినట్లు లేదు. మరీ కావాలనీ తెలుగు సినిమాలను దూరం పెడుతోందా.. లేక సరైన కథ కోసం ఎదురుచూస్తోందా, 'జాను' ఫలితం ఎఫెక్టా తెలియదు. అయితే ప్రస్తుతం సమంత సినిమాల కన్నా డిజిటల్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు కనపడుతోంది. అందులో భాగంగానే సినిమాలకు బైబై చెబుతోందని అంటున్నారు.

First published:

Tags: Samantha akkineni

ఉత్తమ కథలు