హోమ్ /వార్తలు /సినిమా /

Samantha : కోర్టులో సమంతకు మళ్లీ షాక్ -పోర్న్ వీడియోల కేసు ప్రస్తావన -జడ్జి అనూహ్య వ్యాఖ్యలు

Samantha : కోర్టులో సమంతకు మళ్లీ షాక్ -పోర్న్ వీడియోల కేసు ప్రస్తావన -జడ్జి అనూహ్య వ్యాఖ్యలు

సమంత: స‌మంత కూడా దుమ్ము దులిపేస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా స‌మంత‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. విడాకుల తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తుంది. ఈ మధ్యే ఓ సినిమాకు 3 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

సమంత: స‌మంత కూడా దుమ్ము దులిపేస్తుంది. పెళ్లైన త‌ర్వాత కూడా స‌మంత‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. విడాకుల తర్వాత వరస సినిమాలకు సైన్ చేస్తుంది. ఈ మధ్యే ఓ సినిమాకు 3 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు విచారణ సందర్భంగా సమంత తరఫు లాయర్లు.. బాలీవుడ్ పోర్న్ వీడియోల ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆమె వార్తలపై శాశ్వత ఆంక్షలు(పర్మనెంట్ ఇంజెక్షన్) విధించాలని కోరారు. తీర్పు చెబుతూ సమంతను ఉద్దేశించి జడ్జి అనూహ్య వ్యాఖ్యలు చేశారు..

ఇంకా చదవండి ...

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. అక్కినేని నాగ చైతన్యతో విడాకులకు సంబందించి తన ప్రతిష్టను దిగజార్చేలా కంటెంట్ ను ప్రసారం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఆమె వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆమెపై వీడియోలు, కామెంట్లు చేసినవారు క్షమాపణలు చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించడంలేదన్న కోర్టు.. సెలబ్రిటీలు కూడా వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనూహ్యరీతిలో సమంత తరఫు లాయర్లు.. బాలీవుడ్ పోర్న్ వీడియోల ఉదంతంలో నటి శిల్పా శెట్టిపై ముంబై కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించినా అనుకూల ఆదేశాలు రాకపోవడం గమనార్హం. కూకట్ పల్లి కోర్టులో గురువారం చోటుచేసుకున్న ఉత్కంఠభరిత వాదనలు, కోర్టు ఆదేశాలు ఇలా ఉన్నాయి...

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకోడానికి గల కారణాలు ఇవేనంటూ సమంతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడం తెలిసిందే. వాటిలో రెండు యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేసిన కంటెంట్, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు వెలువరించిన అభిప్రాయాలను తప్పుపడుతూ ఆ ముగ్గురిపై సమంత కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసింది. దీనిపై సుదీర్ఘ వాదోపవాదాలు సాగగా, మంగళవారం నాడు జడ్జి కీలక ఆదేశాలిచ్చారు. తక్షణమే సదరు వీడియోలను, కామెంట్లను తొలగించాలన్న ఊరల ఆదేశాలు తప్ప ఈ కేసులో సమంత వాదనలేవీ చెల్లుబాటు కాకపోవడం గమనార్హం.

నటి సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీల్లేదన్న కోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబ్‌ ఛానెల్స్‌ వెంటనే అలాంటి కంటెంట్‌ని తొలగించాలని, డాక్టర్ వెంకట్ రావు కామెంట్లను కూడా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. సమంత కూడా తన వ్యక్తిగత విషయాలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయారాదంటూ కోర్టు హితవు పలికింది. నిజానికి..

యూట్యూబ్ ఛానళ్లు, డాక్టర్ వెంకట్ రావుపై పరువు నష్టం దావాలో.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా తనకు క్షమాపణలు చెప్పాలని సమంత కోరింది. కానీ ఆ దిశగా ఆదేశాలు ఇచ్చేందుకు జడ్జి నిరాకరించారు. దీంతో సమంత తరఫు లాయర్లు.. బాలీవుడ్ పోర్న్ వీడియోల ఉదంతాన్ని ప్రస్తావించారు. బాలీవుడ్ పోర్న్ వీడియోల కేసులో నిర్మాత రాజ్ కుంద్రా అరెస్టయిన సందర్భంలో ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పా శెట్టిపై సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అడ్డగోలు కథనాలు రాగా, వాటిపై ఆమె ముంబై కోర్టుకు వెళ్లగా ‘శిల్పా శెట్టి పరువుకు భంగం కలిగించే వార్తలను ఎన్నటికీ ప్రసారం చేయరాదు’అని తీర్పు వచ్చిన విషయాన్ని సమంత లాయర్లు గుర్తుచేశారు. శిల్పా శెట్టిలాగే సమంత విషయంలోనూ శాశ్వత ఆంక్షలు(పర్మనెంట్ ఇంజెక్షన్) విధించాలని లాయర్లు కోరినా అందుకు కోర్టు అంగీకరించలేదు. దీంతో పర్మనెంట్ ఇంజెక్షన్ ఉత్తర్వుల కోసం సమంత మరో పిటిషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Published by:Madhu Kota
First published:

Tags: Hyderabad, Samantha akkineni, Samantha Ruth Prabhu, Shilpa sheety

ఉత్తమ కథలు