స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా మారింది. చేతి నిండా సినిమాలతో వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తాజాగా సమంత(Samantha) కీలక పాత్రలో వస్తున్న సినిమా శాంకుంతలం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా తన పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” (Shaakuntalam) నుంచి కీలక అప్డేట్ ను షేర్ చేసింది సమంత. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం “శాకుంతలం”. ఇందులో యువరాణి శకుంతలగా కనిపించబోతోంది సామ్. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
అయితే తాజాగా డబ్బింగ్ పూర్తి చేశానంటూ సామ్ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసింది. డబ్బింగ్ పనులు పూర్తయినట్లు సమంత పోస్టు చూస్తే మనకుత తెలుస్తోంది. దీంతో సామ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “శాకుంతలం” మూవీ విడుదలకు రెడీ అయిపోతోంది. ఇప్పటికే శాకుంతలం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. ఇక “శాకుంతలం”(Shaakuntalam)లో రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతోంది. మోహన్ బాబు(Mohan Babu), సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగల్ల, వర్షిణి సౌందరరాజన్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. గుణ(Guna) టీమ్‌వర్క్స్, దిల్ రాజు(Dil raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ(Mani Sharma) సంగీతం అందించనున్నారు.
మరోవైపు సామ్ వరుసగా తమిళ్,తెలుగు,హిందీ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరక్కుతున్న “కాతు వాకుల రెండు కాదల్” సినిమా షూటింగ్, డబ్బింగ్ ను సామ్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. సమంత యశోద, సిటాడెల్, అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలతో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇటు సినిమాలు చేస్తూనే అటు ఐటెం సాంగ్స్ కూడా చేసేస్తోంది సమంత. పుష్ప 2లో కూడా సమంతతో మరో స్పెషల్ సాంగ్ ఉంటుందని ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.