హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: ఒంటిపై మూడు టాటూలు... అసలు టాటూనే వేయించుకోకూడదన్న సమంత

Samantha: ఒంటిపై మూడు టాటూలు... అసలు టాటూనే వేయించుకోకూడదన్న సమంత

సమంత టాటూస్

సమంత టాటూస్

సమంత ఒంటిపై మూడు చోట్ల టాటూలు వేయించుకుంది. అయితే ఆ మూడు కూడా నాగచైతన్యకు సంబంధించినవే.దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాటూలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సమంత(Samantha).. సోషల్ మీడియాలో ఏ పోస్టు చేసిన వైరల్ అవుతోంద. ఇక చైతన్యతో విడాకుల తర్వాత(Samantha Naga Chaitanya Divorce).. సమంత ఏ పని చేసిన దాన్ని మరింత వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియా(Social Media)లో మరింత యాక్టివ్ గా ఉంటుంది. తన స్టోరిలలో ఎప్పుడూ ఫోటోలు, మోటివేషన్ కోట్స్ పెడుతూనే ఉంటుంది. సమంత(Samantha) చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసింది. దీంతో అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.తాజాగా టాటూ(Tattoo)లపై కూడా సమంత కీలక వ్యాఖ్యలు చేసింది. సమంత ఒంటిపై పలు చోట్ల టాటూలు వేయించుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఓ నెటిజన్ మీరు ఎప్పటికైనా వేసుకోవాలన్న టాటూ ఏంటి అని సమంతను అడిగారు. దీనికి సమంత సమాధానమిస్తూ.. అసలు టాటూ వేయించుకోవాలి అనుకున్న ఆలోచన కూడా మానుకోండి. లైఫ్ లో ఎప్పుడూ టాటూ వేయించుకోకూడదు” అని తెలిపింది. అయితే గతంలో సమంత టాటూలు వేయించుకున్న విషయం తెలిసింది. సమంత బాడీపై మూడ చోట్ల వేయించుకున్న టాటూలు(Tattoo) కూడా అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

నాగచైతన్య(Naga Chaitanya),సమంత కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమా గుర్తుగా సామ్.. తన వీపుపై ymc అనే టాటూ అప్పట్లో వేయించుకుంది. ఇక సమంత నడుముకి పైభాగంలో చై అని టాటూ ఉంటుంది. అలాగే కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకుంది. అయితే ఇలాంటి టాటూ నాగచైతన్య చేతికి కూడా ఉంటుంది. ‘

నీ జీవితం నువ్వు చూసినట్టుగా ఉంటుంది. ఇతరులు చూసినట్టుగా కాదు’ అని ఈ టాటూ అర్ధం. అయితే మూడు టాటూలు కూడా చైకి సంబంధించి వేసుకుంది సమంత. కానీ ఇప్పుడు చైకు విడాకులు ఇచ్చి విడిపోయిన విసయం తెలిసిందే. అందుకే ఇంకెప్పుడు లైఫ్ లో టాటూ(Tattoo) వేయించుకోకండి అని చెప్తుంది సమంత. దీంతో సమంత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై నాగ చైతన్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మరోవైపు సమంత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. తమిళ్,తెలుగు,హిందీలో పలు సినిమాల్లో సమంత ప్రస్తుతం నటిస్తొంది.

First published:

Tags: Naga Chaitanya, Samantha Ruth Prabhu, Samantha tattoos

ఉత్తమ కథలు