హోమ్ /వార్తలు /సినిమా /

Samantha: చాలా శ్రమతో కూడిన సమయం... సమంత వీడియో వైరల్

Samantha: చాలా శ్రమతో కూడిన సమయం... సమంత వీడియో వైరల్

సమంత

సమంత

నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత ఫుల్ బిజీగా మారింది. చేతి నిండా ఫుల్ సినిమాలతో తన సమయాన్ని బిజీగా మార్చుకుంది. తమిళ్,తెలుగు,హిందీలో వరుసగా కొత్త ప్రాజెక్టులు చేస్తోంది.

  స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా మారింది. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సింగిల్ స్టేటస్‌కి వచ్చేసింది. అలాగే ఇప్పుడు సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టేసింది.ఇటు తెలుగు, అటు తమిళ్‌తో పాటు..బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తూ ఈ భామ బిజీగా మారింది. అలాగే సోషల్ మీడియాలో కూడా సామ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధంచిన అనేక విషయాల్ని షేర్ చేస్తూ.. తన అభిమానులకు టచ్‌లో ఉంటుంది. అయితే తాజాగా సమంత చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోతో పాటు బలమైన శరీరం, బలమైన మనస్సు అంటూనే 2022-23 తనకు శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న సమయం అని సమంత పోస్ట్ చేసింది.

  గత కొంతకాలంగా సమంత ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టింది. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో హెవీవెయిట్‌లను అమాంతంగా ఎత్తేస్తోంది. సామ్ తన తన ట్రైనర్ జునైద్ పర్యవేక్షణలో హెవీ వెయిట్‌లను ఈజీగా ఎత్తేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి సంబంధించి ఓ కామెంట్ కూడా పెట్టింది. బలమైన శరీరం, బలమైన మనస్సు అంటూనే 2022-23 తనకు శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న సమయం అని సమంత పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు సామ్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది, సమంత ఫిట్ నెస్ చూసిన ఫ్యాన్స్ వావ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

  ఇక సామ్ ప్రస్తుతం 'శాకుంతలం', 'యశోద' అనే రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తోంది. త్వరలలో ఈ సినిమాలు అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. మరోవైపు రాజ్ అండ్ డికెతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బాలీవుడ్ చిత్రంలో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఓ మూవీ, అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే మరో హాలీవుడ్ మూవీకి కూడా సైన్ చేసింది. అక్షయ్ కుమార్‌తో కూడా బాలీవుడ్‌లో మరో సినిమాలో సామ్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక పుష్ప2లో సామ్ చేసిన ఐటెం సాంగ్ గురించి అందరికీ తెలిసిందే.మరోసాని పుష్ప2లో కూడా సమంత తన స్పెషల్ సాంగ్‌తో ఫ్యాన్స్‌ను పండగ చేయనున్నట్లు తెలుస్తోంది.

  మొత్తం మీద విడాకులతో పెళ్లి జీవితానికి బ్రేక్ ఇచ్చిన ఈ భామ.. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు సినిమాలకు సైన్ చేసి పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే సామ్ కు సౌత్ లో, నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మరి సమంత ఎంతవరకు ఈ విషయంలో సక్సెస్ అవుతుందో తెలుసుకోవాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Samantha akkineni, Samantha Ruth Prabhu, Tollywood

  ఉత్తమ కథలు