హోమ్ /వార్తలు /సినిమా /

Samantha : తెలుగు సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచిన సమంత..

Samantha : తెలుగు సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచిన సమంత..

సమంత (Samantha Photo : Instagram)

సమంత (Samantha Photo : Instagram)

Samantha : సమంత త్వరలో మొద‌లుపెట్ట‌బోతున్న తెలుగు సినిమాకు త‌న రెమ్యున‌రేష‌న్ (remuneration)ను పెంచేసింద‌ని టాక్. తెలుస్తోన్న సమాచారం ప్ర‌కారం కొత్త సినిమాకు సమంత రూ.3 కోట్లు తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌స్తుతం తెలుగులో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచిందని అంటున్నారు.

ఇంకా చదవండి ...

  Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స‌మంత (Samantha)పేరు మారుమ్రోగిపోయింది. ఆమెకు సంబంధించి ఎన్నో క‌థ‌నాలు, రూమర్స్ వ‌చ్చాయి. అన్నింటిని ఓపిక‌గా భ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు స‌మంత‌. ఇక అది అలా ఉంటే సమంత విడాకుల తర్వాత సూపర్ బిజీగా మారారు.

  మరోవైపు స‌మంత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె త్వరలో మొద‌లుపెట్ట‌బోతున్న ఓ తెలుగు సినిమాకు త‌న రెమ్యున‌రేష‌న్ (Samantha remuneration)ను పెంచేసింద‌ని టాక్. ఇప్పటి నుంచి కొత్త సినిమాకు సమంత రూ.3 కోట్లు తీసుకుంటుంద‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌స్తుతం తెలుగులో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమచారం తెలియాల్సి ఉంది.

  Janhvi Kapoor : చీరలో పరువాల విందు చేసిన జాన్వీ.. అదరహో అనాల్సిందే...

  ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.

  ఈ సినిమాతో పాటు సమంత మరో సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.

  ఇక సమంత నటిస్తున్నఇతర సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

  Poorna : వైరటీ డ్రెస్‌లో పరువాల విందు చేసిన పూర్ణ.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

  ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

  వీటితో పాటు సమంత ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Samantha Ruth Prabhu, Tollywood news

  ఉత్తమ కథలు