అతనితో ఆ..సీన్స్ చేయడానికి సమంత చాలా కష్టపడాల్సి వచ్చింది..నందిని రెడ్డి

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఓ బేబీ’ తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోతో రోమాంటిక్ సీన్స్ చేయడానికి సమంత చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు..ఈ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి.

news18-telugu
Updated: June 12, 2019, 5:20 PM IST
అతనితో ఆ..సీన్స్ చేయడానికి సమంత చాలా కష్టపడాల్సి వచ్చింది..నందిని రెడ్డి
సమంత, నందిని రెడ్డి
news18-telugu
Updated: June 12, 2019, 5:20 PM IST
సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఓ బేబీ’ తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సమంతతో పాటు నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఓ సాంగ్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బ‌ృందం. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో చేసిన రొమాంటిక్ పాటల గురించి హీరోయిన్ సమంత, దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ..దానికి సంబందించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఆ వీడియోలో సమంత మాట్లాడుతూ..'ఓ బేబీ' సినిమా కోసం నాగశౌర్యతో కలిసి రొమాన్స్ చేయడం చాలా చెత్తగాను, కష్టంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది సమంత.

ఓ బేబీ సినిమా పోస్టర్..Photo: Twitter


ఆమె ఇంకా మాట్లాడుతూ..నాగశౌర్యకు చాలా సిగ్గని..దీంతో ఆయనను రొమాన్స్‌ మూడ్‌లోకి దించేందుకు ఓ ప్లాన్ వేసి..ఆయనకు ఇష్టమైన కుక్కల గురించి మాట్లాడుతూ అలా కొంత క్లోజ్ అవుతూ..రోమాంటిక్ సీన్స్ చేశామని చెప్పింది సమంత. దీనికి తోడు ఈ సినిమా డైరెక్టర్ నందిని రెడ్డి కూడా నాగశౌర్య గురించి మాట్లాడుతూ నాగ శౌర్య చాలా సిగ్గరి అని.. సమంత, అతనితో రోమాంటిక్ సీన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. నందిని రెడ్డి మాట్లాడుతూ.. నాగశౌర్య తీరు చూసి నేను టెన్షన్‌గా ఫీలయ్యానని..నాగ శౌర్యకు అంత సిగ్గుందని నాకు అసలే తెలియదన్నారు. హీరోయిన్‌ ఓ చోట ఉంటే.. నాగశౌర్య ఓ 20 అడుగుల దూరంలో ఉండేవాడని నందిని రెడ్డి పేర్కోన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. సమంత, నాగశౌర్యలో ఉండే కామన్ ఇంట్రెస్ట్ కుక్కులు. దీంతో అలా ఆ కుక్కల గురించి మాట్లాడుతూ నాగశౌర్య కొంత దగ్గరగా.. ఫ్రీగా మారిన తర్వాత రోమాంటిక్ సీన్స్‌ను, పాటలను షూట్ చేశామన్నారు. అయితే సమంత, నాగశౌర్య జంట తెరమీద చాలా రోమాంటిక్‌గా ఉందని.. అద్భుతంగా వచ్చిందన్నారు నందిని రెడ్డి.First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...