SAMANTHA GOT ANOTHER RECORD IN HER CAREER SHE IS TOP 5 LIST OF OTT PLATFORM TA
Samantha : విడాకులు తర్వాత సమంత ఖాతాలో మరో రికార్డు.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తగ్గేదేలే అంటున్న సామ్..
సమంత (Instagram/Photo)
Samantha : అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎక్కడ తగ్గడం లేదు. అంతేకాదు డైవోర్స్ తర్వాత ఈమెకు టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్లో ఈమెకు క్రేజ్ పెరిగింది.
Samantha : అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎక్కడ తగ్గడం లేదు. అంతేకాదు డైవోర్స్ తర్వాత ఈమెకు టాలీవుడ్, కోలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్లో ఈమెకు క్రేజ్ పెరిగింది. సినిమాల విషయంలో సమంత దూకుడు పెంచింది. అంతేకాదు ఇంతకు ముందు ఎపుడు లేనట్టు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’లో ఊ..అంటావా మావ.. ఊహూ అంటావా.. అంటూ ఐటెం సాంగ్ చేయడం ఒక ఎత్తు అయితే.. అందులో అందాల ఆరబోసి చేసి ఔరా అనిపించింది. ఈ పాట కోసం ఏకంగా రూ. 50 లక్షల వరకు పారితోషకం అందుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఈ క్రమంలోనే సమంత వరుసగా తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాలు ఒప్పుకుంటున్నారు స్యామ్. రీసెంట్గా సమంత.. మరో సినిమాకు సైన్ చేసింది. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'యశోద' చిత్రంలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పింది. తాజాగా సమంత ఖాతాలో మరో రికార్డు మొదలైంది.
ఈమె ఓటీటీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్‌ను ఒర్మాక్స్ మీడియా విడదల చేసింది. భారతీయ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ పర్ఫామెన్స్తో అద్భుతంగా మెప్పించిన టాప్ 5 యాక్టర్స్ లిస్టులో సమంత నాల్గో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో మనోజ్ బాజ్‌పేయ్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక పంకజ్ త్రిపాఠి రెండో ప్లేస్‌లో నిలిస్తే.. నవాజుద్దీన్ సిద్ధిఖి మూడో ప్లేస్‌లో నిలిచారు. ఇక సమంత నాల్గో స్థానంలో నిలిచింది. కథానాయిక విషయంలో ఆమె ఫస్ట్ రావడం విశేషం. ఆ తర్వాత 5వ స్థానంలో రాధికా ఆప్టే..
6వ స్థానంలో కేకే మీనన్..
7వ స్థానంలో సైఫ్ అలీ ఖాన్..
8వ స్థానంలో సుస్మితా సేన్..
9వ స్థానంలో జితేంద్ర కుమార్..
10వ స్థానంలో తమన్నా భాటియా తర్వాతి స్థానంలో ఉన్నారు.
సమంత ఈ యేడాది అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ కూడా ఒకటి. మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి జంటగా నటించగా.. 2019లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో సీజన్ 1 విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు IMDBలో 8.8/10 రేటింగ్ దక్కించుకుంది.
ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రధారులుగా ఉన్నారు. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. రెండో పార్ట్‌లో సమంత శ్రీలంక LTTE తీవ్రవాది పాత్రలో అలరించింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.