Samantha : విడాకుల తర్వాత సమంత ఫుల్ బిజీ... ఒకే రోజు రెండు సినిమాల ప్రకటన..

Samantha Photo : Twitter

Samantha : నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.

  • Share this:
    Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె (Divorce with Naga Chaitanya) నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత స‌మంత (Samantha)పేరు మారుమ్రోగిపోయింది. ఆమెకు సంబంధించి ఎన్నో క‌థ‌నాలు, రూమర్స్ వ‌చ్చాయి. అన్నింటిని ఓపిక‌గా భ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు స‌మంత‌. ఇక అది అలా ఉంటే సమంత విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది.

    ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా తాజాగా విడుదలైంది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనున్నారు. ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. పూర్తి వివ‌రాలు త్వరలో వెల్ల‌డికానున్నాయి.


    ఈ సినిమాతో పాటు సమంత మరో సినిమాను చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.

    Suriya : దొంగలు మీ జాతిలోను ఉంటారు.. అదిరిన సూర్య జై భీమ్ టీజర్.. నవంబర్ 2 నుంచి స్ట్రీమింగ్..

    ఇక ఏ క్షణమైతే ఆమె నాగచైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారో.. అప్పటి నుంచి ఆమె పట్ల రకరకాల రూమర్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇన్ని రోజుల ఓపిక పట్టిన సమంత ఈ విషయంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకున్నానని, తాను అవకాశవాదినని ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కోంటున్నాను. అబార్షన్లు చేసుకున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

    ఓ వైపు విడాకుల బాధ నుంచే బయటపడలేకపోతున్న సమయంలో.. తనపై ఇలా చేస్తూ పర్సనల్‌గా అటాక్ చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు సమంత.



    ఇక సమంత నటిస్తున్నఇతర సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

    Ram Charan | Prashanth Neel : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్.. ఇదేమి లైన్ అప్.. మామూలుగా లేదుగా...

    ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

    ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: