ఐబిజా బీచ్‌ల్లో.. అందమైన టాటూతో అదరగొట్టిన సమంత..

Samantha Akkineni : సమంత.. మామ నాగార్జున పుట్టినరోజును జరపడానికి  భర్త నాగచైతన్యతో పాటు స్పెయిన్‌ వెళ్లింది.

news18-telugu
Updated: September 1, 2019, 7:48 AM IST
ఐబిజా బీచ్‌ల్లో.. అందమైన టాటూతో అదరగొట్టిన సమంత..
Instagram/samantharuthprabhuoffl
  • Share this:
Samantha Akkineni : సమంత అక్కినేని... ఇటీవల చేసిన సినిమాలన్నీ  బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. అది అలా ఉంటే.. ప్రస్తుతం సమంత మామ నాగార్జున పుట్టినరోజును జరపడానికి  భర్త నాగచైతన్యతో పాటు స్పెయిన్‌ వెళ్లింది. స్పెయిన్‌లోని ఐబిజా ఐలాండ్  వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది అక్కినేని ఫ్యామిలీ. సమంత, నాగ చైతన్య, అఖిల్, నాగార్జున, అమల.. ఇలా ఫ్యామిలీ అంతా ఐబిజా అందాలను ఆస్వాదిస్తున్నారు. కింగ్ నాగార్జున తన 60వ పుట్టినరోజు వేడుకలను గురువారం అక్కడే జరుపుకున్నారు. కాగా సమంత అక్కడి బీచ్‌ అందాలను ఆస్వాదిస్తోంది.. ఇటీవల బీచ్ పక్కన ఓ కుర్చిలో కూర్చున్న సమంత ఫోటోను నాగ చైతన్య క్లిక్ మనించగా... ఆ ఫోటోను సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయిన విషయం తెలిసిందే. 

View this post on Instagram
 

Wild and free 🌊


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

అది అలా ఉంటే.. మామ పుట్టిన రోజు వేడుకల్లో పింక్ డ్రెస్‌లో మెరిసింది. గులాబీ రంగు దుస్తుల్లో మరింత అందంగా కనిపించింది సమంత. దాంతో నెటిజన్లు ఇప్పుడు ఆమె ధరించిన డ్రెస్‌ గురించే మాట్లాడుకుంటున్నారు. సమంత ధరించిన కాస్ట్యూమ్స్ విలువ దాదాపుగా రూ.2లక్షల వరకు ఉంటుందని సమాచారం. కాగా మరోసారి సమంత బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోస్‌ను పోస్ట్ చేసింది. వాటిలో ఓ ఫోటోలో సమంత వీపుపై ఓ అందమైన ట్యాటూ ఉంది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 
First published: September 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>