SAMANTHA EMOTIONAL POST ON THE FAMILY MAN 2 RAJI CHARACTER SR
Samantha Akkineni : ఫ్యామిలీ మ్యాన్ విషయంలో సమంత భావోద్వేగం.. ఇది వారికి నివాళి..
Samantha Photo : Twitter
Samantha Akkineni : సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
Samantha Akkineni : సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ వెబ్ సీరిస్‌లో సమంత రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో కనిపించింది. రాజీ పాత్రలో పాత్రలో సమంత ఇరగదీసిందనే చెప్పోచ్చు. తన నటనతో పాటు డైలాగ్ డెలివరీ, ఆ పాత్ర కోసం సమంత ఫిట్ నెస్, డీ గ్లామర్ లుక్‌లో నటిస్తూ వావ్ అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ సమంత యాక్టింగ్ గురించి మాట్లాడుతూ తెగ పొగుడుతున్నారు. ఓ స్టార్ హీరోయిన్ అలాంటీ పాత్ర చేయడం మామూలు విషయం కాదనీ.. సమంత చాయిస్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక ఈ సందర్భంగా సమంత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 పై వచ్చిన అన్ని కామెంట్స్, రివ్యూలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని తెలిపింది. ఈలం యుద్ధంలో మహిళల పాత్ర కూడా గొప్పదని.. ఈలం యుద్దంలో లక్షల మంది తమ జీవనోపాధిని, ఇళ్లను కోల్పోయారు. రాజీ కథ, కల్పితమైనప్పటికీ, అసమాన యుద్ధం కారణంగా మరణించినవారికి రాజీ పాత్ర ఓ నివాళి.. అంటూ శ్రీలంకలో తమిళులపై జరిగిన దాడి గురించి భావోద్వేగం చెందారు. ఇక మరోవైపు కొందరు అనుకున్నట్లు ఈ వెబ్ సీరిస్ తమిళులకు వ్యతిరేకంగా ఏమి లేదని తేలింది. ఈ వెబ్ సీరిస్‌లో తమిళ శ్రీలంకన్స్ను బ్యాడ్ క్యారెక్టర్లో చూపించారని తమిళనాడులో వివాదం చెలరేగింది. అందులో భాగంగా అక్కడి ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ కూడా రాసింది. ఈ వెబ్ సీరిస్‌ను బ్యాన్ చేయాలనీ.. ఆ లేఖలో కోరింది.
ఇక గత సీజన్ సూపర్ హిట్ కావడంతో ఈసారి సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ వెబ్ సీరిస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి సీజన్ ఎక్కువుగా నార్త్ ఇండియాలో జరగగా... ఈ తాజా సీజన్ చెన్నై, శ్రీలంక నేపథ్యంగా సాగింది. ఇక ఎప్పటిలాగే శ్రీకాంత్ రోల్లో మనోజ్ బాజ్ పాయ్ కనిపించి అదరగొట్టారు. ఇక ఈ సీజన్లో సమంత రోల్ కొత్తగా యాడ్ అయ్యింది. ఊహించని విధంగా సమంత లుక్ ఉంది. సమంత శ్రీలంకన్ రెబల్ లుక్‌లో అదరగొట్టిందనే అంటున్నారు నెటిజన్స్.
ఈ తాజా సీజన్‌ను కూడా తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు దర్శకత్వం వహించారు. గతంలో ఈ ద్వయం హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు తెలుగులో సందీప్ కిషన్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'డి ఫర్ దోపిడి' సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతంలలో కూడా నటిస్తున్నారు. కరోనా కొంత తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుకానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.