స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు సంబంధించి ప్రతి కదలిక మీడియాలో హాట్ టాపికే. గత కొన్ని నెలలుగా సమంత వెళుతున్న తీరు, ఆమె స్టెప్స్ అన్నీ కూడా జనాల్లో డిస్కషన్ పాయింట్స్ అవుతున్నాయి. అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)తో డివోర్స్ తీసుకున్నాక సమంత హవా మరింత పెరిగింది. అటు వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తూనే ఇటు సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయింది. స్నేహితులతో సరదా టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూనే తన సినీ కెరీర్లో ముందడుగేస్తోంది. టాలీవుడ్ (Tollywood) బిగ్గెస్ట్ సినిమాల్లో భాగమవుతూనే బాలీవుడ్ (Bollywood)లో కూడా తన మార్క్ చూపించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలు, తన ఫీలింగ్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్న సామ్.. తాజాగా ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత హంగామా రెట్టింపయింది. మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ తన మనసులోని భావాలను అందరికీ తెలిసేలా చెబుతూ ఫాలోయింగ్ పెంచుకున్న ఆమె.. రీసెంట్గా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఓ ఊపు ఊపేసింది. అల్లు అర్జున్‌తో సమంత స్పీడ్ చూసి ఫిదా అయ్యారు ఆమె ఫ్యాన్స్. ఇక అదే జోష్ కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సెట్స్ మీదకొచ్చి సూపర్ ఫాస్ట్‌గా షూటింగ్లో పాల్గొంటోంది. 'ఖుషి' అనే ఓల్డ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లోని అందమైన ప్రదేశాల్లో జరిగుతోంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ అంటే తనకెంత ఇష్టమో తెలిపేలా ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్ చేసింది సమంత.
View this post on Instagram
కాశ్మీర్ లోని ప్రకృతి అందాలను, అక్కడి జీవన విధానాలను కెమెరాలో బంధించి వాటిని అభిమానులతో షేర్ చేసుకున్న సమంత.. కాశ్మీర్‌ను ఎప్పుడు తలచుకున్నా కూడా తన హృదయంలో ప్రశాంతతతో కూడిన చిరునవ్వు విరబూస్తుందని పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాశ్మీర్ లివింగ్ స్టైల్, అక్కడి ప్రకృతి అందాలంటే సమంత తెగ ఇష్టమని తెలుసుకున్న నెటిజన్లు తమ తమ ఫీలింగ్స్ బయటపెడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Amazing first schedule in kashmir
Thankyou @TheDeverakonda @Samanthaprabhu2 @vennelakishore #saranyapradeep and Whole #khushiteam 👏 congratulations
#khushiondec23 #khushi pic.twitter.com/jax2pkYRvS
— Shiva Nirvana (@ShivaNirvana) May 23, 2022
ఇక ఖుషీ సినిమా విషయానికొస్తే.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓ వైవిద్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా కాశ్మీర్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసిన చిత్రయూనిట్ సెకండ్ షెడ్యూల్ అప్డేట్ అతి త్వరలో ఇస్తామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.