Home /News /movies /

SAMANTHA DELETED INSTAGRAM POST GO VIRAL NEWS IN SOCIAL MEDIA SB 2

Samantha: నాగచైతన్య సినిమా ట్రైలర్ రిలీజ్.. పోస్టు పెట్టి డిలీట్ చేసిన సమంత

సమంత నాగచైతన్య

సమంత నాగచైతన్య

డెడ్ అని పోస్టు పెట్టి తీసేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమంత అందుకే పోస్టు పెట్టి తీసేసిందా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు.

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha).. హీరో నాగచైతన్య(Naga Chaitanya) విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి త్వరగానే ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక విడాకులు తర్వాత ఎవరి పనిలో వారు బిజీగా మారారు. అటు సమంత ఫుల్‌ సినిమాలతో బిజీగా ఉంటే.. ఇటు నాగచైతన్య కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చైతన్య నటించిన కొత్త సినిమా థాంక్యూ(Thank You) విడుదలకు సిద్ధమవుతోంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. డిఫరెంట్ లవ్ స్టోరిగా వస్తున్న ఈ చిత్ర టీజర్ ఆసక్తికరంగా ఉంది.

    ఓ వైపు నాగచైతన్య సినిమా థాంక్ యూ ట్రైలర్ రిలీజ్(Thank You Trailer Release) అయిన క్రమంలో మరో వైపు నాగచైతన్య మాజీ భార్య సమంత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి డిలీట్ చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నాగచైతన్య 'థాంక్ యూ' టీజర్ చూసి సమంత రియాక్షన్ ఇచ్చిందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే 'థోర్​: లవ్ అండ్ థండర్' మూవీ ట్రైలర్ చూసిన సమంత.. తన ఇన్ స్టా స్టోరిస్‌లో 'డెడ్' అని రాసి ఫైర్ ఎమోజీ పెట్టింది. కొద్ది సేపటి తర్వాత డిలీట్ చేసింది. అనంతరం ఈ ఫిల్మ్‌లో నటించిన క్రిస్టియన్ బాలే లుక్‌ను షేర్ చేస్తూ 'ది గాడ్​ ఆఫ్​ యాక్టింగ్'​ అని క్యాప్షన్ ఇచ్చింది.

    మరోవైపు థాంక్ యూ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. 'మనం' వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ తర్వాత విక్రమ్‌- చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'థాంక్ యూ' కాగా, ఈ ఫిల్మ్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవిక నాయర్‌ నటించారు. టీజర్‌లో సన్నివేశాలు చూస్తుంటే క్లాస్‌, మాస్‌ గెటప్‌లో నాగచైతన్య లుక్ ఇప్పటికే వైరల్ అయ్యింది. డైరెక్టర్ విక్రమ్‌ కుమార్‌ మార్క్‌ డైలాగ్స్ కనిపిస్తున్నాయి. ఇక థమన్ అందించిన నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవల్‌లో ఉంది. మొత్తం మీద చైతన్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Naga Chaitanya Akkineni, Samantha Ruth Prabhu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు