అక్కినేని కోడలు సమంతలోని ఈ కోణాన్ని చూసి మాములు ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా సందీప్ రెడ్డి వంగా .. హిందీలో అర్జున్ రెడ్డి సినిమాను షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నిరేపుతున్నాయి. ముఖ్యంగా కబీర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ను మీరో చెంప దెబ్బలు కొట్టడంపై ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ప్రేమికుల మధ్య ఒకరినొకరు కొట్టుకునేంత చనువు ఉండాలన్నారు. అలా ఉంటేనే వారి మధ్య ప్రేమ ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఐతే.. సందీప్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్స్ పాటు గాయని చిన్మయి తమదైన శైలిలో స్పందించారు. తాజాగా సమంత కూడా సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయంది.

సందీప్, కబీర్ సింగ్‌లో షాహీద్ కపూర్ Photo: twitter
ఇక సమంత .. సందీప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దీనిపై సమంత ట్విట్టర్లో వివరణ ఇచ్చింది. సినిమా కథ నచ్చడం వేరు.. కామెంట్స్‌ను వ్యతిరేకించడం రెండూ వేరు వేరు అంటూ చెప్పుకొచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ కథ తనకు నచ్చిన మాట వాస్తవమే కానీ.. ఆ సినిమాను అందరికీ అనునయిస్తూ సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం తనకు నచ్చలేదు అని సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతోన్న ట్రోలింగ్‌కు సమంత సమాధానం ఇచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 07, 2019, 17:55 IST