ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు : సాహో భామ సినిమాపై సమంత కామెంట్

Samantha Akkineni : ప్రభాస్ ‘సాహో’ భామ శ్రద్ధా కపూర్‌ నటించిన ‘చిచ్చోరే’ సినిమాపై సమంత ఆసక్తికర కామెంట్‌ చేసింది.

news18-telugu
Updated: September 8, 2019, 8:52 PM IST
ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు : సాహో భామ సినిమాపై సమంత కామెంట్
Instagram/samantharuthprabhuoffl
  • Share this:
Samantha Akkineni : సమంత అక్కినేని... ఇటీవల చేసిన సినిమాలన్నీ  బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. ఈ యేడాది మొదట్లో తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. అది అలా ఉంటే ప్రభాస్ ‘సాహో’ భామ శ్రద్ధా కపూర్‌ నటించిన ‘చిచ్చోరే’ సినిమాపై సమంత కామెంట్‌ చేసింది. హిందీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌  ప్రధాన పాత్రలో నటించగా.. నితీశ్‌ తివారీ దర్శకుడు. ‘చిచ్చోరే’ కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలై  మంచి టాక్‌ పాటు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా ఈ సినిమాను సమంత ఇటీవలే చుశారట.. ఇదే విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో పేర్కోంటూ.. ‘చిచ్చోరే’ సినిమాను బాగా ఎంజాయ్‌ చేసానని తెలిపారు.

Instagram/samantharuthprabhuoffl


సమంత తన పోస్ట్‌లో ‘చిచ్చోరే’ సినిమాకు గురించి రాస్తూ.. సినిమా అమేజింగ్‌గా ఉందని.. చాలా కాలం తర్వాత ఇంతగా నవ్వానని అంతేకాదు. ఈ సినిమా చూసి కొంత నేర్చుకున్నానంది.  ప్రస్తుతం సమంత తమిళ్‌లో సూపర్ హిట్టైనా ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. శర్వానంద్‌ హీరోగా చేస్తున్నాడు.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...