Home /News /movies /

SAMANTHA COMMENTS ON ANUSHKA SHARMA HOT PHOTOS AT INSTAGRAM SB

అనుష్క శర్మ హాట్ ఫోటో.. ఊ..లల అన్న సమంత.. ఊ అంటావా అంటున్న నెటిజన్లు

అనుష్క శర్మ సమంత

అనుష్క శర్మ సమంత

సమంత ఒక్కరే కాదు.. అనుష్క హాట్ ఫోటోలు చూసి.. బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది స్పందించారు, దియా మిర్జా,వాణికపూర్,రాశీ ఖన్నా, అర్జున్ కపూర్ వంటి ప్రముఖులు అనుష్క ఫోటోలపై కామెంట్లు పెడుతున్నారు.

    అనుష్క శర్మ(Anushka Sharma).. బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్లలో ఒకరు. షారుక్ ఖాన్‌(Sharukh khan)తో కలిసి తొలిసారిగా వెండితెరపై మెరిసింది. 2008లో వచ్చిన రబ్ నే బనాది జోడీ అనే సినిమాతో సినీ ప్రేక్షకులకు అనుష్క పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి సినిమాల్లో నటించింది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో కలిసి సినిమాలు చేసింది. ఆ తర్వాత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని ప్రేమించి పెళ్లాడింది అనుష్క. ఈ జంటకు ఓచిన్నారి కూడా జన్మించింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌తో అరకొర సినిమాలు చేస్తుంది అనుష్క.

    అయితే తాజాగా అనుష్క శర్మ(Anushka Sharma)... తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్సులో హాట్ హాట్ గా ఉండే ఫోటోలను చూసి.. ఇప్పుడు నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు. అయితే అనుష్క్ ఫోటోలను చూసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా రెస్పాండ్ అయ్యింది. ఊ... లల అంటూ... హార్ట్ సింబల్‌ను  పోస్టు చేసింది. దీంతో ఇప్పుడు అనుష్క ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి. సమంత పెట్టిన పోస్టుపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది నీ నెక్ట్ పాటనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు ఊ అంటావా మామా ఊ అంటావా అంటూ.. సమంత పుష్ప ఐటమ్ సాంగ్‌ను పోస్టు చేస్తున్నారు.




    ఇక సమంతతో పాటు అనుష్క ఫోటోలపై మరో హీరోయిన్ కూడా స్పందించింది.  రాశీఖన్న(Rasi Khanna) అనుష్క ఫోటోలను చూసి... స్టన్నింగ్ అంటూ పోస్టు పెట్టింది. ఇక బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) కూడా స్పందించారు.  మిగతా యాసిసరీస్ ఎక్కడా అంటూ.. ప్రశ్నించారు. ఇక వీరితో పాటు దియా మిర్జా, వాణికపూర్ వంటి హీరోయిన్లు కూడా మంట పెట్టేశావు అనే అర్థం వచ్చే విధంగా ఫైర్ సింబల్ ఫోటోల్ని పెట్టారు. దీంతో ఇప్పుడు అనుష్క శర్మ హాట్ ఫోటోలు.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Anushka Sharma, Bollywood, Samantha Ruth Prabhu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు