Home /News /movies /

SAMANTHA COMMENTS ON AFFAIRS AND ABORTION A SOCIAL MEDIA POST GOES VIRAL SR

Samantha : అబార్షన్‌, అఫైర్స్‌పై సమంత కీలక వ్యాఖ్యలు.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్..

Samantha Photo : Instagram

Samantha Photo : Instagram

Samantha : నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు.

  Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైయారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక అది అలా ఉంటే ఏ క్షణమైతే ఆమె నాగచైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారో.. అప్పటి నుంచి ఆమె పట్ల రకరకాల రూమర్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇన్ని రోజుల ఓపిక పట్టిన సమంత ఈ విషయంలో తాజాగా స్పందించారు. అందులో భాగంగా తన సోషల్ మీడియాలో ఓ నోట్‌ను పోస్ట్ చేశారు.

  తన నోట్‌లో రాస్తూ.. తనకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకున్నానని, తాను అవకాశవాదినని ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కోంటున్నాను. అబార్షన్లు చేసుకున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

  Seetimaarr | Hotstar : హాట్ స్టార్‌లో సీటీమార్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..

  ఇంకా ఆమె తన నోట్’లో రాస్తూ తాను ఓ వైపు విడాకుల బాధ నుంచే బయటపడలేకపోతున్న సమయంలో.. తనపై ఇలా చేస్తూ పర్సనల్‌గా అటాక్ చేయడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు సమంత. ఎవరేమన్నా తనపై ప్రభావం పడదని.. కఠిన సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్ అంటూ పెద్ద నోట్‌ను విడుదల చేశారు. ఇక ఈ నోట్‌కు, సమంతకు మద్దతుగా రకుల్ ప్రీత్ రిప్లే ట్వీట్ చేశారు.



  ఇక సమంత విడాకుల తర్వాత ముంబైకి షిఫ్ట్ కానుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అదంతా ఏమి లేదని తెలుస్తోంది. ఆమె ముంబైకి వెళ్లట్లేదని తాజా టాక్. సమంత హైదరాబాద్‌లోనే ఉండనుందట. ఆమె తాజాగా గచ్చిబౌళీలో ఖరీదైన ఫ్లాటును కొన్నట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

  ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

  Anchor Manjusha : పొట్టి స్కర్టులో పరువాల విందు చేసిన యాంకర్ మంజూష..

  ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు.

  ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

  ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Naga Chaitanya Samantha Divorce, Samantha

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు