హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya Samantha Divorce:: 'ఏ మాయ చేశావే' నుంచి 'మజిలీ' వరకు.. ప్రేమ పుట్టింది మాత్రం అప్పుడే..

Naga Chaitanya Samantha Divorce:: 'ఏ మాయ చేశావే' నుంచి 'మజిలీ' వరకు.. ప్రేమ పుట్టింది మాత్రం అప్పుడే..

ఇప్పటికే సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి నుంచి తన పనులు తానే చేసుకోవాలి.. పొద్దున త్వరగా లేవాలి.. మధ్యాహ్నం వరకు పడుకోకూడదు.. నా బెడ్రూమ్ నేనే సర్దుకోవాలి.. ప్రపంచం మారాలంటే ముందు తనకు తాను మార్చుకోవాలి అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

ఇప్పటికే సమంత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి నుంచి తన పనులు తానే చేసుకోవాలి.. పొద్దున త్వరగా లేవాలి.. మధ్యాహ్నం వరకు పడుకోకూడదు.. నా బెడ్రూమ్ నేనే సర్దుకోవాలి.. ప్రపంచం మారాలంటే ముందు తనకు తాను మార్చుకోవాలి అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

Samantha - Naga Chaitanya: సమంత, నాగచైతన్య టాప్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకరు. అయితే తాజాగా ఈ జంట విడిపోతున్నట్టుగా ప్రకటించింది. అయితే ఏ మాయ చేసావే చిత్రంలో తొలిసారిగా సమంత (Samantha) , చైతన్యలు (Naga Chaitanya) కలిసి నటించారు. ఇక పైళ్లి జరిగిన తర్వాత చివరిగా మజిలి చిత్రంలో ఈ జంట కలిసి యాక్ట్ చేశారు.

ఇంకా చదవండి ...

సమంత, నాగచైతన్య టాప్ సెలబ్రిటీ కపుల్స్‌లో ఒకరు. అయితే తాజాగా ఈ జంట విడిపోతున్నట్టుగా ప్రకటించింది. అయితే ఏ మాయ చేసావే చిత్రంలో తొలిసారిగా సమంత (Samantha) , చైతన్యలు (Naga Chaitanya) కలిసి నటించారు. ఇక పైళ్లి జరిగిన తర్వాత చివరిగా మజిలి చిత్రంలో ఈ జంట కలిసి యాక్ట్ చేశారు. అయితే ఈ జర్నీలో సమంత, చైతన్యల మధ్య ప్రేమ ఎప్పుడూ చిగురించింది.. అసలు పెళ్లి వరకు ఎలా వచ్చిందో తెలుసకుందాం.. నాగ చైతన్య, సమంత తొలిసారిగా.. 2009లో ఏ మాయ చేసావే (Yeh Maaya Chesave) చిత్రం సెట్స్‌లో కలుసుకున్నారు. నటీనటులు వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అది కూడా మంచి లవ్‌స్టోరి చిత్రం కావడం.. తెరపై వారి మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. దీంతో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. అయితే ఆ తర్వాత సమంత హీరో సిదార్థ్‌తో రిలేషన్‌లో ఉంది. అయితే 2013‌ లో సమంత, సిదార్థ్‌లు రిలేషన్ బ్రేక్ అయింది.

2014 లో సమంత, నాగచైతన్యలు లిసి ఆటోనగర్ సూర్య (Autonagar Surya) అనే సినిమా కోసం పనిచేశారు. అప్పటికే మంచి స్నేహితులుగా వారిద్దరు కష్టసుఖాలను మాట్లాడుకోవడం, సినిమాలు హిట్ అయినప్పుడు.. ఫ్లాప్ అయినప్పుడు మా ఫీలింగ్స్ ఒకరితో ఒకరం పంచుకోవడం చేశారు. ఆ సమయంలోనే అక్కినేని కుటుంబంలో మూడు తరాలు కలిసి నటించిన చిత్రం మనం లో సమంత నాగచైతన్యకు భార్య పాత్రలో నటిచింది. వారి మధ్య రిలేషన్‌ కారణంగానే సమంతను ఆ చిత్రంలో భాగం చేశారని చెబుతారు.

Samantha - Naga Chaitanya: సమంత, చైతన్యల పదేళ్ల ప్రేమ.. వైరల్ అవుతున్న ఆ 10 ఫొటోలు

ఇక, చైతన్య, సమంతల బంధం కాస్తా మరింత ముందుకు సాగింది. అయితే 2015లో నాగ చైతన్య బర్త్‌ డే రోజు విష్ చేస్తూ సమంత చేసిన ట్వీట్.. వారి మధ్య ఏదో ఉందనే ప్రచారానికి తెర తీసింది. ఆ ట్వీట్‌లో సమంత.. నా అభిమాన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొంది. ఇందుకు చైతన్య.. సామ్ ముద్దు పేరు పాపా ను పేర్కొంటూ రిప్లై ఇచ్చాడు.

Naga Chaitanya Samantha Divorce : నాగ చైతన్య, సమంత విడాకులపై నాగార్జున ఫస్ట్ రియాక్షన్ ఇదే..


ఇక, కొంతకాలం సమంత, నాగ చైతన్య రిలేషన్ గురించి ప్రచారం జరిగింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో వాళ్లు కలిసి కనిపించడంతో.. ఆ ప్రచారానికి బలం చేకూరింది. చివరకు తాము ప్రేమలో ఉన్నట్టుగా చైతన్య, సమంతలు అంగీకరించారు. ఈ విషయం చైతన్య ఇంట్లో మొదట తన తండ్రి నాగార్జునకు చెప్పినట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో.. చైతన్య, సమంతలు.. 2017లో గోవాలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకన్నారు. వారి వివాహం చాలా ఘనంగా జరిగింది, ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగాయి. గోవాలో సమంత, చైతన్య రెండు ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నైలలో రెండు రిసెప్షన్‌లు ఏర్పాటు చేశారు.

Samantha Marriage saree: పెళ్లిలో సమంత ధరించిన చీర ఎవరిదంటే..? నిశ్చితార్థం, పెళ్లిలో ఆమె ధరించిన చీరలు వెరీ స్పెషల్..

పెళ్లి తర్వాత జంటగా..

సమంత, చైతన్యలు పెళ్లి తర్వాత మరోసారి మజిలీ చిత్రంలో స్క్రీన్‌పై జంటగా కనిపించారు. మజిలి చిత్రంలో సమంత.. చైతన్యను విపరీతంగా ప్రేమిస్తుంది. కానీ చైతన్య మాత్రం మరో అమ్మాయితో ప్రేమ విఫలం కావడంతో తీవ్ర నిరాశలో ఉంటాడు. అయితే సమంత మాత్రం చైతన్యను పెళ్లి చేసుకుంటుంది. చైతన్య పట్టించుకోకపోయినా.. అతని కోసమే బతుకుతుంది. చిత్రం చివరలో చైతన్య.. సమంత ప్రేమను అర్థం చేసుకోవడంతో ఇద్దరు ఒక్కటవుతారు. ఈ చిత్రంలో రియల్ లైఫ్ భార్యభర్తలు.. రీల్‌లో కూడా అంతకు మించిన ఏమోషన్స్‌ను పండించారు.

Samantha - Naga Chaitanya: సమంత, నాగ చైతన్య విడాకులు.. విడిపోవడానికి అసలు కారణం ఇదేనా..?

అయితే గత కొంతకాలంగా నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నారని జరుగుతున్న ప్రచారం నిజమయింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో సమంత, చైతన్య ఈ రోజు వేర్వురుగా అధికారిక ప్రకటన విడుదల చేశారు.

First published:

Tags: Naga Chaitanya, Naga Chaitanya Samantha Divorce, Samantha Ruth Prabhu

ఉత్తమ కథలు