Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక విడాకుల ప్రకటన అనంతరం ఎప్పటి లాగే తన పనులు తానే చేసుకోవాలని, బద్దకం వదిలి ముందుకు నడవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను సమంత షేర్చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తొలిసారిగా ఓ యాడ్ షూట్లో పాల్గోన్నారు. హైదరాబాద్‌లోని ముకరంజా జానియర్ కాలేజీలో దీనికి సంబంధించిన షూట్ జరుగుతుంది. అయితే విడాకుల ప్రకటన అనంతరం అసలు సమంత షూట్‌కి రాక పోవచ్చని అనుకున్నారట టీమ్.
కానీ షూట్‌కు హాజరైన సమంత మధ్య మధ్యలో కంటతడి పెట్టకున్నారట. విడాకుల ప్రకటనే దీనికి కారణం అయ్యి ఉండోచ్చని అభిమానులు భావిస్తున్నారు. అయితే మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కెమెరా ముందుకు రాగానే డైరెక్టర్ చెప్పినట్లు నటించి అదరగొట్టారట.
Bheemla Nayak : ఫైనల్ షెడ్యూల్లో భీమ్లా నాయక్.. సంక్రాంతి బరిలో ఖాయం..
ఇక సమంత విడాకుల తర్వాత ముంబైకి షిఫ్ట్ కానుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అదంతా ఏమి లేదని తెలుస్తోంది. ఆమె ముంబైకి వెళ్లట్లేదని తాజా టాక్. సమంత హైదరాబాద్‌లోనే ఉండనుందట. ఆమె తాజాగా గచ్చిబౌళీలో ఖరీదైన ఫ్లాటును కొన్నట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు.
Telugu Films Release in October : అక్టోబర్ నెలలో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..
ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.