హోమ్ /వార్తలు /సినిమా /

బాలీవుడ్‌కు.. సమంత బ్లాక్ బస్టర్ సినిమా..

బాలీవుడ్‌కు.. సమంత బ్లాక్ బస్టర్ సినిమా..

సూపర్ డీలక్స్‌లో సమంత (Source: Twitter)

సూపర్ డీలక్స్‌లో సమంత (Source: Twitter)

ఇటీవల తమిళంలో విడుదలైన ‘సూపర్‌ డీలక్స్‌’ అక్కడ ఓ సంచలనం స‌ృష్టించింది. సినిమా కథ, కథనాలు ఈ సినిమాకు అంత బజ్‌ను తీసుకొచ్చాయి.

  ఇటీవల తమిళంలో విడుదలైన ‘సూపర్‌ డీలక్స్‌’ అక్కడ ఓ సంచలనం స‌ృష్టించింది. సినిమా కథ, కథనాలు ఈ సినిమాకు అంత బజ్‌ను తీసుకొచ్చాయి. సినిమాలో ట్రాన్స్ జెండర్ నేరేటివ్స్, మిగితా పాత్రల ప్రవర్తల ఇంత బజ్‌కు కారణమైంది. దీంతో ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటి దోరికింది. దానికి తగ్గట్టుగానే...సూపర్ డీలక్స్ సూపర్ హిట్టైంది. త్యాగరాజ కుమారరాజన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజల్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే.. విజయ్‌ సేతుపతి, సమంత పోషించిన పాత్రలకు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన వచ్చింది. అంతలా ఆకట్టుకున్న ఈ సినిమాను..సినిమాలో ఉన్న దమ్మును చూసిన హిందీ సినిమా నిర్మాతలు.. బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలనీ చూస్తున్నారు. అందులో భాగంగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రైట్స్‌‌ను దక్కించుకుందని టాక్.

  సూపర్ డీలక్స్ పోస్టర్..Photo: Twitter

  ఈ హిందీ రీమేక్‌ను కూడా త్యాగరాజ కుమారరాజానే దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్యాగరాజన్ మాట్లాడానికి ఇష్టపడలేదు. బాలీవుడ్‌లో ఈ సినిమాను అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానిలు నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Bollywood news, Samantha Ruth Prabhu, Tamil Cinema, Tamil Film News

  ఉత్తమ కథలు