Samantha Akkineni : సమంత 'ఏమాయ చేశావే' సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. దీనికి తోడు ఇటీవల ఈ భామ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతున్నాయి. తన భర్త నాగ చైతన్యతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా ఈ యేడాది మొదట్లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌ను రాబట్టింది. ఆ తర్వాత సమంత ఓ కొరియన్ రీమేక్‌లో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
అది అలా ఉంటే సమంత తన కొడుకు యష్ అక్కినేని అల్లరిని తెగ ఎంజాయ్ చేస్తోంది. వాడికి స్నానాలు చేయించడం, యష్‌తో ఆడుకోవడం అంతేకాదు వాడి అల్లరిని కెమెరాలో బందించి ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం చేస్తోంది. అయితే సమంత పెంచుకుంటున్న యష్ ఎవరో కాదు.. ఓ కుక్క పిల్ల. సమంత, నాగచైతన్యలు యష్ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. దానికి సంబందించిన ఫోటోస్‌ను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది. ఆ కుక్క పిల్ల కూడా సూపర్ క్యూట్ ఉండి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
అందాల విందు చేస్తోన్న నేహా శర్మ...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.