లీకైన సమంత, శర్వానంద్ కొత్త సినిమా... వైరల్‌ అవుతోన్న పిక్స్

సమంత, శర్వానంద్‌ జంటగా దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం '96' తెలిసిందే. ఈ సినిమాలో సమంత చూడిదార్‌ లుక్‌లో ఉన్న కొన్ని ఫోటోస్ సోషల్‌లో వైరల్ అవుతున్నాయి.

news18-telugu
Updated: July 22, 2019, 1:57 PM IST
లీకైన సమంత, శర్వానంద్ కొత్త సినిమా... వైరల్‌ అవుతోన్న పిక్స్
సోషల్‌లో వైరల్ అవుతోన్న సమంత పిక్స్
  • Share this:
సమంత, శర్వానంద్‌ జంటగా దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం '96' తెలిసిందే. ఈ సినిమా '96' అనే తమిళ సినిమాకు రీమేక్. తమిళ '96' సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష నటించారు. ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. ఈ 96 సినిమాను నిజ జీవితంలో జరిగే కథతో.. దానికి సరిపోయో కథనాలతో, రియాలీటి దగ్గరగా తెరకెక్కించారు దర్శకుడు ప్రేమ్ కుమార్. దీంతో ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అక్కడ ఘన విజయం సాధించింది. దీంతో ఇదే సినిమాను తెలుగులో సమంత, శర్వానంద్‌లతో తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రీమేక్ చేస్తున్నారు.

తెలుగు 96 సినిమాలో లీకైన సమంత ఫోటోస్


ఈ సినిమాకు సంబందించి.. చూడిదార్ వేసుకన్న కొన్ని సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  సమంత ఈ సినిమాలో తమిళంలో త్రిష పోషించిన పాత్రను చేస్తోంది. ఇప్పుడు అదే లుక్‌లో ఉన్న కొన్ని సమంత ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అది అలా ఉంటే  సమంత ప్రధాన పాత్రలో వచ్చిన 'ఓ బేబీ' ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సమంత ఓ మంచి విజయాన్ని అందుకుంది. ఇలాంటీ సమయంలో ఇలా తన సినిమాకు సంబందించిన కొన్ని ఫోటోస్ బయటకు రావడం సమంతకు షాక్ కలిగించే విషయమే.

 

First published: July 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>