సమంత శర్వానంద్ 'జాను' నుండి పాట విడుదల..

తమిళ హిట్ సినిమా '96'‌కు రీమేక్‌‌గా వస్తోన్న జాను నుండి ఈరోజు కొత్త పాట విడుదలవుతోంది.

news18-telugu
Updated: January 21, 2020, 10:36 AM IST
సమంత శర్వానంద్ 'జాను' నుండి పాట విడుదల..
Twitter
  • Share this:
సమంత అక్కినేని ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా వెలుగుతున్నారు. సమంత 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై ఆ సినిమా హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ హిట్ సినిమా '96' రీమేక్‌ జానులో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. జాను ఫిబ్రవరి 14న విడుదలకానుంది. తమిళలో త్రిష, విజయ్ సేతుపతి ప్రధానంగా సాగిన 96ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాను కూడా రూపొందిస్తున్నాడు. దీంతో 'జాను' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ మాతృకకు సంగీతం అందించిన గోవింద్ వసంత ఈ సినిమాకు కూడా సంగీతాన్నిఅందిస్తున్నాడు. విడుదల దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటలకు 'ప్రాణం' అనే సింగిల్‌ను వదలనుంది చిత్రబృందం. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు