Home /News /movies /

SAMANTHA AND RAM POTHINENI TWEETS OVER NALLAMALA ISSUE TA

#savenallamala:నల్లమల అడవులను కాపాడాలంటూ సమంత, రామ్ ట్వీట్..

సమంత,రామ్ పోతినేని (Twitter/Photos)

సమంత,రామ్ పోతినేని (Twitter/Photos)

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సేవ్ నల్లమల ఉద్యమం నడుస్తోంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టాలనుకున్న యురేనియం తవ్వకాలపై రోజురోజూకు తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న యురేనియం తవ్వకాలపై సినీ నటి సమంతతో పాటు రామ్ స్పందించారు.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సేవ్ నల్లమల ఉద్యమం నడుస్తోంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టాలనుకున్న యురేనియం తవ్వకాలపై రోజురోజూకు తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీలు గొంతు కలుపుతున్నారు. యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో సెలబ్రిటీల నుంచి అందరు నల్లమల అడవులను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ సపోర్ట్ తెలియజేసారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, విజయ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ వంటి హీరోలు, సెలబ్రిటీలు కూడా సేవ్ నల్లమల అంటూ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.


    తాజాగా సమంతతో పాటు హీరో రామ్ నల్లమలను కాపాడలంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు.


    సమంత ఒక అడుగు ముందుకేసి యురేనియం తవ్వకాల నుండి నల్లమల అడవిని కాపాడండి అని రాష్ట్రపతిని కోరింది. తవ్వకాలకు వ్యతిరేఖంగా వేసిన పిటిషన్‌లో సంతకాలు చేసింది.
    First published:

    Tags: Nallamala forest, Pawan kalyan, Ram Pothineni, Samantha, Save Nallamala, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు