మరోసారి చైతన్యతో సమంత.. దర్శకత్వం వహించేది ఎవరంటే..

సమంత, నాగ చైతన్య ఇప్పటికే నాలుగు చిత్రాల్లో కలిసి నటించగా.. ఐదోసారి నందిని రెడ్డి దర్శకత్వంలో జంటగా కనిపించనున్నారు.

news18-telugu
Updated: June 25, 2020, 7:44 AM IST
మరోసారి చైతన్యతో సమంత.. దర్శకత్వం వహించేది ఎవరంటే..
నాగ చైతన్య, సమంత Photo : Twitter
  • Share this:
అక్కినేని సమంత.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుండి నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది సమంత. ఇక తన మొదటి హీరో నాగచైతన్య నే వివాహం చేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత తాజా సినిమా జాను. తమిళ సినిమా 96కు తెలుగు రీమేక్ ఇది. మంచి అంచనాల మధ్య విడుదలై పెద్దగా అలరించలేకపోయింది. అయినా.. 'జాను'లో సమంత నటన మంచి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నాడట. చైతూ.. ఓ బేబీ చిత్రంలో కూడా స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఈ సమంత, చైతూ కలిసి నటించిన చాలావరకు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరి అభిమానులు ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
First published: June 25, 2020, 6:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading