హోమ్ /వార్తలు /సినిమా /

బాలీవుడ్‌కు వెళ్లనున్న సమంత అక్కినేని 'ఓ బేబీ'..

బాలీవుడ్‌కు వెళ్లనున్న సమంత అక్కినేని 'ఓ బేబీ'..

'ఓ బేబీ' సినిమా పోస్టర్ Photo:Twitter.com/Samanthaprabhu2

'ఓ బేబీ' సినిమా పోస్టర్ Photo:Twitter.com/Samanthaprabhu2

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఓ బేబీ’ తెలిసిందే, అయితే ఈ సినిమాను హిందీలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ చేయనుంది.

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఓ బేబీ’ తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సమంతతో పాటు నాగశౌర్య, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులైలో విడుదల కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే ఓ సాంగ్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బ‌ృందం. కొత్తదనంతో వస్తున్న ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే...అనుకోకుండా ఆ పెద్దావిడా..పాతికేళ్ల భామగా మారిపోతుంది. ఆమెకు అదెలా సాధ్యమైందనేదే ‘ఓ బేబీ’ స్టోరీ. ఈ సినిమాలో ఓల్డ్ లేడీ పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ నటించగా.. యంగ్ పాత్రను సమంత పోషిస్తోంది. ఓల్డ్ నుంచి యంగ్ మారడంతో ఏర్పడిన కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

అయితే ‘ఓ బేబీ’ని ఇప్పుడు బాలీవుడ్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. హిందీ సినిమాకు చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ‘ఓ బేబీ’ని బాలీవుడ్‌లో రీమేక్ చేయనుంది. సమంత పాత్రలో ఓ పాపులర్ హిందీ హీరోయిన్ కనిపించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.

' isDesktop="true" id="219576" youtubeid="WkduVm-h__4" category="movies">

First published:

Tags: Bollywood news, Hindi Cinema, Naga shourya, Oh Baby, Samantha, Telugu Cinema, Telugu Cinema News, Telugu Movie News, Tollywood

ఉత్తమ కథలు