Oh Baby Movie Review: ‘ఓ బేబి’ మూవీ రివ్యూ.. అంతా సమంత మాయ..

Oh Baby Movie Review | ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీలో ఉంది. అంతేకాదు ఇపుడు అదే జోష్‌లో ఈ భామ యాక్ట్ చేసిన ‘ఓ బేబి’ మూవీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాతో సమంత అక్కినేని మరో సక్సెస్ అందుకుందా లేదా మన రివ్యూలో చూద్దాం..

news18-telugu
Updated: July 5, 2019, 1:06 PM IST
Oh Baby Movie Review: ‘ఓ బేబి’ మూవీ రివ్యూ.. అంతా సమంత మాయ..
‘ఓ బేబీ’ మూవీ (Source: Twitter)
  • Share this:
నటీనటులు : సమంత,లక్ష్మి,రాజేంద్ర ప్రసాద్,నాగ శౌర్య, రావు రమేష్, తదితరులు..

నిర్మాణం : సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్,

సంగీతం : మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్

దర్శకత్వం : బి.వి.నందినీ రెడ్డి

రేటింగ్ : 2.75 / 5

ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సూపర్ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీలో ఉంది. అంతేకాదు ఇపుడు అదే జోష్‌లో ఈ భామ యాక్ట్ చేసిన ‘ఓ బేబి’ మూవీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాతో సమంత అక్కినేని మరో సక్సెస్ అందుకుందా లేదా మన రివ్యూలో చూద్దాం..కథ విషయానికొస్తే.. 

70 ఏళ్ల బామ్మ వాళ్ల కొడుకు,కోడలు,మనవడు,మనవరాళ్లతో జీవిస్తూ ఉంటుంది. పెద్దావిడకు చాదస్తం కాస్త ఎక్కువే. మనవడు, మనవరాళ్లు పెద్దవాళ్లైన కోడలిపై తన అత్త పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటుంది. ఈ కోవలో అత్త బాధలు పడేలేక కోడలికి గుండెపోటు వస్తోంది. అత్త పెట్టే బాధలు లేకుంటే ఆమె బతుకుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో...సదురు పెద్దావిడా మనవరాలు.. నాన్నమ్మను దుర్భాషలాడి ఇంట్లోంచి వెళ్లేటట్టు చేస్తోంది. ఈ క్రమంలో ఈ  పెద్దావిడ ఒక ఫోటో స్టూడియోలో ఒక ఫోటో తీయించకుంటుంది. అక్కడ అనుకోకుండా ఈ పెద్దావిడ పాతికేళ్ల యువతిగా మారిపోతుంది.ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలే ‘ఓ బేబి’ స్టోరీ.

నటీ నటుల విషయానికొస్తే..

‘ ఓ బేబి’ సినిమాకు కర్త,కర్మ, క్రియ అన్ని సమంతనే. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూకుడు మీదున్న అక్కినేని కోడలు... ఇపుడు ‘ఓ బేబి’గా మరోసారి ఆడియన్స్‌ను  మాయ చేసింది. ఓబేబి’గా సమంతను చూసిన తర్వాత మరెవరినీ ఊహించుకోలేము. నిజంగానే ఒక ముసలావిడ పడుచుపిల్లగా మారితే.. ఎలా ఉంటుందో ఆ హావభావాలను చక్కగా పండించింది. ముఖ్యంగా ముసలావిడ నుంచి యంగ్‌గా మారే క్రమంలో సమంత పండించిన నటన బాగుంది. మరోవైపు పెద్దావిడగా సీనియర్ నటి లక్ష్మి గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అహంభావంతో పాటు ఉదాత్తమైన పాత్రలను పోషించిన లక్ష్మీ..ఈ సినిమాలో కాస్తంత చాదస్తం ఉన్న అత్తగారి పాత్రలో జీవించింది. హీరోగా  నటించిన నాగశౌర్య ఉన్నంతలో పర్వాలేదనిపించాడు. సమంతను ప్రేమించే ప్రేమికుడిగా అతని నటన ఆకట్టుకుంటోంది. మరోవైపు లక్ష్మీ కొడుకు పాత్రలో నటించిన రావురమేష్, కొడలి పాత్రలో నటించిన ప్రగతితో పాటు మిగతా పాత్రల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్,జగపతి బాబు, మనవడిగా నటించిన తేజ తదితరులు తమ పరిధి మేరకు నటించారు.

టెక్నీషియన్స్‌తో పాటు విశ్లేషణ..

గత కొన్నేళ్లుగా మన దేశంలో కొరియాలో హిట్టైన  సినిమాలను ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు.రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ చిత్రం కొరియాలో హిట్టైయిన ‘ఓడ్ మై ఫాదర్’ మూవీకి రీమేక్. తాజాగా ‘ ఓ బేబి’ సినిమాను కొరియాలో హిట్టైయిన ‘మిస్ గ్రానీ’కి తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేయడంలో నందినీ రెడ్డి దాదాపు విజయం సాధించిందనేది చెప్పాలి. ముఖ్యంగా ఈ స్టోరీకి సమంతను సెలెక్ట్ చేయడంలోనే నందినీ రెడ్డి సగం సక్సెస్ అయ్యారు. మొత్తంగా తాను రెడీ చేసుకున్న కథను అంతే పకడ్బందీగా తెరకెక్కించింది. ఆమె దేవుడి వరంతో యంగ్ మారడం.. లాంటివి లాజిక్‌గా దూరంగా ఉన్నా ఓవరాల్‌గా పర్వాలేదు. రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది. మిక్కీ జే మేయర్  మ్యూజిక్‌తో పాటు ఆర్ ఆర్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి పూర్తిగా క్లాస్ టచ్‌తో  ఏ క్లాస్, మల్టీప్లెక్స్ ప్రేక్షకుల టేస్ట్‌కు తగ్గట్టు  ఉన్న ఈ సినిమాకు బీ,సీ సెంటర్ మాస్ ఆడియన్స్ ఆదరణ ఏ మేరకు దక్కుతుందో చూడాలి.

ప్లస్ :

  • సమంత, లక్ష్మీ నటన

  • ఫోటోగ్రఫీ

  • కథ,దర్శకత్వం


మైనస్:

  • అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు

  • మాస్‌ను ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడం


చివరి మాట : ‘కొంత మందిని ఆకట్టుకునే ‘ఓ బేబి’ 
Published by: Kiran Kumar Thanjavur
First published: July 5, 2019, 1:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading