‘96’ తెలుగు రీమేక్‌కు గుడ్ బై చెప్పిన సమంత..

సమంత అక్కినేనికి  సోషల్ మీడియలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో సెపెరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ భామ.. 96 తెలుగు రీమేక్‌లో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్..

news18-telugu
Updated: October 13, 2019, 2:42 PM IST
‘96’ తెలుగు రీమేక్‌కు గుడ్ బై చెప్పిన సమంత..
సమంత అక్కినేని (Instagram/Photo)
  • Share this:
సమంత అక్కినేనికి  సోషల్ మీడియలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో సెపెరేట్‌గా చెప్పాల్సిన పని లేదు.నాగ చైతన్యతో పెళ్లై.. అక్కినేని కోడలైన తర్వాత ఈమె క్రేజ్ పీక్స్ కు వెళ్లింది.  అంతేకాదు పెళ్లి తర్వాత ఈమె హీరోయిన్‌గా నటించిన ‘రంగస్థలం’, ‘అభిమన్యుడు’, ‘సూపర్ డీలక్స్’,‘మజిలీ’ ‘ఓ బేబి’ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. పెళ్లి తర్వాత తన భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. తాజాగా ఈ భామ.. తమిళంలో సూపర్ హిట్టైన ‘96’ తెలుగు రీమేక్‌లో నటించింది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. తెలుగులో సమంత, శర్వానంద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాను తమిళంలో డైరెక్ట్ చేసిన జి.ప్రేమ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.  ఈ సినిమాను నన్ను నేను బెటర్ చేేసుకునేలా ఛాలెంజ్ చేసిన క్యారెక్టర్ అంటూ కాస్తంత ఎమోషన్ అయింది.  శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. మరోవైపు సమంత.. ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌లో విలన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. గతంలో విక్రమ్ నటించిన 10 ఎంద్రాకుల్లా సినిమాలో ప్రతినాయిక పాత్రలో నటించింది. అందులో ద్విపాత్రాభినయం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఏకంగా మెయిన్ విలన్ రోల్ చేయబోతుందనే ప్రచారం జరుగుతుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 13, 2019, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading