Home /News /movies /

SAMANTHA AKKINENI WISH TO ACT BOLLYWOOD HERO RANBIR KAPOOR TA

Samantha: ఆ బాలీవుడ్ హీరోతో నటించాలనేది తన కోరిక అంటున్న సమంత..

సమంత (File/Photo)

సమంత (File/Photo)

Samantha: ఆ బాలీవుడ్ హీరోతో నటించాలనేది తన కోరిక అంటుంది సమంత. ప్రస్తుతం సమంత.. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్‌తో పాటు అదే స్టాయిలో విమర్శలు ఎదుర్కొంది. 

ఇంకా చదవండి ...
  Samantha: ఆ బాలీవుడ్ హీరోతో నటించాలనేది తన కోరిక అంటుంది సమంత. టాలీవుడ్‌లో ఏమాయ చేసావే సినిమాతో అడుగుపెట్టి.. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకొని.. సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని ఫ్యామిలీ కోడలైంది. పెళ్లి తర్వాత సమంత మూడు సినిమాలు.. ఆరు ఆఫర్లు అన్నట్టుగా సాగిపోతుంది. అక్కినేని  హీరోలు హిట్ కోసం ముఖం వాచిపోతుంటే.. సమంత మాత్రం వరుస హిట్స్‌తో దూసుకుపోతుంది. హీరోయిన్‌గా 11 యేళ్లుగా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌తో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించనుంది. గతంలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఎపుడు విడుదల కావాల్సిన ఈ వెబ్ సిరీస్ ఆలస్యంగా ఆడియన్స్ ముందుకు వస్తోంది.

  తాజాగా ఈ వెబ్ సిరీస్‌ సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్‌తో పాటు అదే స్టాయిలో విమర్శలు ఎదుర్కొంది.  ఈ వెబ్ సిరీస్‌లో సమంత LTTE టెర్రరిస్ట్ పాత్రలో నటిస్తోంది. దీనిపై తమిళ ఆడియన్స్ నుంచి విముఖత వ్యక్తం అవుతోంది. పుట్టుకతో తమిళురాలైన సమంత.. ఇలాంటి పాత్రలో కనిపిస్తుండంతో తమిళ ఆడియన్స్‌ను ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వాళ్లు LTTE అనేది శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన సంస్థ అని వాదిస్తున్నారు. అంతేకానీ.. అదో ఉగ్రవాద సంస్థ కాదంటున్నారు. అలాంటి తమిళ టైగర్స్‌ను టెర్రరిస్టులుగా చూపిస్తారా అని తమిళ జనాలు మండిపడుతున్నారు.

  Samantha Akkineni Being Trolled Over LTTE Terrarist Charector in The Family Man 2 Web Series,Samantha: ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత పాత్రపై దారుణమైన ట్రోలింగ్..,చSamantha Akkineni,Samantha Akkineni Trolled,Samantha Akkineni Trolled Over The Family Man 2 Web SEries,the family man season 2 trailer, Samantha web series, Samantha amazon prime web series,Samantha Akkineni to act in the family man season 2,samantha akkineni,samantha,samantha in the family man web series,actress samantha to act in negative roles,samantha family man web series,samantha ruth prabhu,samantha naga chaitanya,akkineni family,samantha hot in saree,samanatha akkineni,samantha movies,samantha with akkineni family,akkineni nagarjuna,samantha akkineni dance in marriage,akhil akkineni,the family man web series,akkineni,సమంత వెబ్ సిరీస్,ఫ్యామిలీ మ్యాన్‌లో సమంత,సమంత పాత్రపై ట్రోలింగ్
  ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌లో సమంత  (Youtube/Amazon Prime/Photo)


  ఇలాంటి పాత్రలో నటించడానికి సమంతకు నిజంగా సిగ్గులేదా అని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.  మిగతా భాషల్లో ఆడియన్స్‌ను ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు సమంత ఈ పాత్రలో అదరగొట్టిందిని చెబుతున్నారు. ఈ సిరీస్‌లో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న సమంతకు ఇపుడు తమిళ ఆడియన్స్‌ను ట్రోల్స్ ఎదురుకావడంతో కాస్తంత ఇబ్బంది పడుతోంది. మొత్తంగా తమిళ ప్రజల ఆగ్రహానికి గురైన ఈ వెబ్ సిరీస్‌కు ఇపుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో తనకు గతంలో ఆఫర్స్ వచ్చినా.. నటించలేదని చెప్పుకొచ్చింది. ఏమో భయం వల్ల నటించలేదు అంది. అక్కడ ప్రతిభ చాలా ఎక్కువ అంటూ సమాధానమిచ్చింది. ఒకవేళ హిందీలో నటిస్తే.. రణ్‌బీర్ కపూర్ సరసన నటించాలనేది తన కోరిక అంటూ మనసులో మాట బయట పెట్టింది.

  Akkineni Samantha
  షమంత (Akkineni Samantha)


  ఇక ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్  మొదటి సీజన్ ఎక్కువుగా నార్త్ ఇండియాలో జరగగా... ఈ తాజా సీజన్ చెన్నై నేపథ్యంలో సాగనుంది.  ఇక ఎప్పటిలాగే శ్రీకాంత్ రోల్‌లో మనోజ్ బాజ్ పాయ్ అదరగొట్టారు. ఇక ఈ సీజన్‌లో సమంత రోల్ కొత్తగా యాడ్ అయ్యింది. అసలు ఊహించని విధంగా సమంత లుక్ ఉంది. సమంత ఓ టెర్రిరిస్టు లుక్‌లో అదరగొట్టిందనే అంటున్నారు నెటిజన్స్. ఈ కొత్త సీజన్ వచ్చే జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.ఇక ఫ్యామిలీ మ్యాన్ మొదటి సీజన్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో వచ్చే రెండవ సీజన్‌పై మంచి అంచనాలున్నాయి. సమంత ఈ వెబ్ సీరీస్‌లో రాజీ పాత్రలో కనిపించనుంది. ఈ సీజన్ ఒకేసారి హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్‌లో స్ట్రీమింగ్ కానుంది.

  samantha The Family Man 2
  samantha Instagram


  ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె తమిళంలో ‘కాతు వాకుల2 ‘రెండు కాదల్’ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో  కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. కరోనా కొంత తగ్గిన తర్వాత షూటింగ్ మొదలుకానుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Ranbir Kapoor, Samantha akkineni, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు