సమంత అక్కినేని Vs నయనతార.. క్రేజీ వార్‌కు తెరతీసిన దర్శకుడు..

Samantha Akkineni: ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఉండటం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ సాహసం చేయడానికి రెడీ అయ్యాడు విఘ్నేష్ శివన్. నయనతార ప్రియుడిగానే ఈయన ఎక్కువ మందికి పరిచయం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 15, 2020, 4:12 PM IST
సమంత అక్కినేని Vs నయనతార.. క్రేజీ వార్‌కు తెరతీసిన దర్శకుడు..
సమంత నయనతార ఫోటోస్ (samantha nayanthara)
  • Share this:
ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఉండటం అంటే చిన్న విషయం కాదు. కానీ ఆ సాహసం చేయడానికి రెడీ అయ్యాడు విఘ్నేష్ శివన్. నయనతార ప్రియుడిగానే ఈయన ఎక్కువ మందికి పరిచయం కానీ విఘ్నేష్ మంచి దర్శకుడు కూడా. అప్పట్లో ఈయన తెరకెక్కించిన నానుం రౌడీధాన్ సినిమాతో స్టార్ అయ్యాడు. అప్పుడే నయన ఈయనకు పడిపోయింది కూడా. అప్పట్నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. అందుకే నయనతార, విజయ్ సేతుపతి జంటగా ఓ కథ రాసుకున్నాడు. అందులో సమంత అక్కినేని మరో హీరోయిన్. ఈ భామ తమిళంలో నటించక చాలా రోజులు అవుతుంది.
సమంత విఘ్నేష్ శివన్ నయనతార విజయ్ సేతుపతి (vignesh samantha vijay nayanthara)
సమంత విఘ్నేష్ శివన్ నయనతార విజయ్ సేతుపతి (vignesh samantha vijay nayanthara)

పెళ్లి తర్వాత తమిళ సినిమాలకు దూరమైపోయింది సమంత అక్కినేని. మళ్లీ ఇన్నాళ్ళకు విజయ్ సినిమాలో నటించబోతుంది. నయనతార, సమంత లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్‌ను తన సినిమాలో హ్యాండిల్ చేయబోతున్నాడు విఘ్నేష్. విజయ్ సేతుపతి ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. హీరో, విలన్ అని తేడా లేకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇలాంటి సమయంలో నయన్, సమంత లాంటి ఇద్దరు స్టార్ హీరోయిన్లతో నటించే అవకాశం అందుకున్నాడు ఈయన. 'నానుమ్ రౌడీ దాన్' కాంబినేషన్ రిపీట్ కానుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

సమంత విఘ్నేష్ శివన్ నయనతార విజయ్ సేతుపతి (vignesh samantha vijay nayanthara)
సమంత విఘ్నేష్ శివన్ నయనతార విజయ్ సేతుపతి (vignesh samantha vijay nayanthara)

కారెక్టర్ బాగుంటే తప్ప పెళ్లి తర్వాత సినిమాలు ఒప్పుకోవడం లేదు సమంత అక్కినేని. ఇలాంటి సమయంలో విజయ్ సినిమా చేస్తుందంటే ఇందులో ఎంతగా కథ బాగుంటుందో అర్థం చేసుకోవచ్చు. 'కాత్తువకుల రెండు కాదల్' అనే టైటిల్‌ ఈ సినిమాకు కన్ఫర్మ్ చేసారు. అంటే 'తలుపు వెనుక రెండు ప్రేమ కథలు' అని దీని అర్థం. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రేక్షకులను ఆకర్షించేలా 'నయనతార Vs సమంత' అని పోస్టర్ విడుదల చేసాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఇక్కడ VS అంటే వర్సెస్ అని కాదు.. విజయ్ సేతుపతి అని అర్థం. మొత్తానికి ఒకే సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉండటంతో అంచనాలు కూడా అదే స్థాయిలోనే ఉన్నాయి.

First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు