రామ్ చరణ్‌తో మళ్లీ సమంత.. రంగస్థలం కాంబినేషన్ రిపీట్స్..

Ram Charan Samantha: రామ్ చరణ్, సమంత కలిసి నటించిన రంగస్థలం సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోడీ మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయిప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2020, 7:27 AM IST
రామ్ చరణ్‌తో మళ్లీ సమంత.. రంగస్థలం కాంబినేషన్ రిపీట్స్..
మరోసారి కలిసి నటించబోతున్న సమంత రామ్ చరణ్ (rangasthalam ram charan samantha)
  • Share this:
కొన్నిసార్లు ఎన్ని సినిమాలు చేసామనేది కాదు.. కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా చేసామనేది కూడా ముఖ్యమే. అలాంటి సంచలన కాంబినేషన్ రామ్ చరణ్, సమంత. ఈ ఇద్దరూ కలిసి నటించడానికి ఎనిమిదేళ్ళు పట్టింది. అందరు హీరోలతో నటించిన తర్వాత పెళ్లయ్యాక కానీ చరణ్‌తో జోడీ కట్టలేదు స్యామ్. వీళ్లు కలిసి నటించిన రంగస్థలం సినిమా ఎలాంటి సంచలన విజయం సాధించదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రామలక్ష్మిగా సమంత.. చిట్టిబాబుగా రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఇలాంటి సంచలన కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరోసారి కలిసి నటించబోతున్న సమంత రామ్ చరణ్ (rangasthalam ram charan samantha)
మరోసారి కలిసి నటించబోతున్న సమంత రామ్ చరణ్ (rangasthalam ram charan samantha)


చరణ్ ప్రస్తుతం రాజమౌళి RRR సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఈయన గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఈ మధ్యలోనే మరో సినిమా చేయనున్నాడు చరణ్. అదే తన తండ్రి చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్.. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం చరణ్‌ను అడిగితే వెంటనే ఒప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో యంగ్ చిరంజీవి పాత్రలో చరణ్ నటిస్తాడని.. అది కూడా నక్సలైట్ పాత్ర అని తెలుస్తుంది.

తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
దీనిపై ఇప్పటి వరకు ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు కానీ చరణ్ నటించడం మాత్రం పక్కా అని తెలుస్తుంది. ఎప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో చరణ్ పాల్గొనబోతున్నాడు. దాదాపు అరగంట పాటు ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని.. కథను మలుపు తిప్పేలా ఉండబోయే ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా సమంత అక్కినేని నటించబోతుందని తెలుస్తుంది.

మరోసారి కలిసి నటించబోతున్న సమంత రామ్ చరణ్ (rangasthalam ram charan samantha)
మరోసారి కలిసి నటించబోతున్న సమంత రామ్ చరణ్ (rangasthalam ram charan samantha)


ముందు ఈ పాత్ర కోసం కియారా అద్వానీతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లను అడిగినా కూడా వాళ్లు ఆసక్తి చూపించకపోవడంతో సమంతను తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం మాత్రం రెజీనాని తీసుకోవడం.. ఇప్పటికే ఆమెపై ఆ స్పెషల్ సాంగ్ చిత్రీకరించడం కూడా జరిగాయి. ఇప్పుడు చరణ్, సమంత అంటున్నారు.. ఏదేమైనా కూడా చాలా స్పెషల్స్‌తో చిరంజీవి సినిమా వచ్చేస్తుంది. దసరాకు ఈ చిత్రం విడుదల కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా చిరంజీవి సినిమాను నిర్మిస్తున్నాయి.
First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు