• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAMANTHA AKKINENI WILL BE THE FEMALE LEAD FOR NTR TRIVIKRAM NEW FILM SR

పూజా హెగ్డే స్థానంలో సమంత.. ఎన్టీఆర్‌కు జంటగా మరోసారి..

పూజా హెగ్డే స్థానంలో సమంత.. ఎన్టీఆర్‌కు జంటగా మరోసారి..

ఎన్టీఆర్, సమంత (NTR Samantha Akkineni)

NTR 30 : ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత తాజాగా రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే.

  • Share this:
    #NTR30 : ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సూపర్ హిట్ తర్వాత ఇటీవల రెండో సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ‌లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తైయిన తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకుకు షిఫ్ట్ కానున్నాడు.  ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. టైటిల్‌ను బట్టి ఇది పూర్తి రాజకీయ నేపథ్యమున్న సినిమా అనే విషయం అర్థమవుతోంది. అంతేకాదు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఇప్పటి వరకు త్రివిక్రమ్ యాక్షన్, ఫ్యామిలీ, ఫాక్ష్యన్ చిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కించాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయబోతున్న ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాను పూర్తిగా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించనున్నాడు. అందులో భాగంగా ఎన్టీఆర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడి వారసుడిలా నటించబోతున్నాడట. పర్ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్ని కుదరితే సమ్మర్ 2021లో సినిమా విడుదల కానుంది.

    NTR 30,NTR 30 update,Ntr trivikram new film news,NTR 30 news,ntr,trivikram, ayinanu poyiraavale hasthinaku,ntr trivikram title ayinanu poyiraavale hasthinaku,ala vaikunthapurramloo,Trivikarm to work with NTR for his next movie,jr ntr,jr ntr new movie,jr ntr movies,jr ntr upcoming movie,trivikram,trivikram movies,jr ntr new look for his next movie revealed,ntr movies,jr ntr and trivikram srinivas new movie,jr ntr and trivikram srinivas new movie confirm,trivikram srinivas with jr ntr,jr ntr trivikram srinivas movie,anirudh music for trivikram and jr ntr next movie,jr ntr hard work for his new makeover,త్రివిక్రమ్,ఎన్టీఆర్,అరవింద సమేత వీరరాఘవ,అయినను పోయిరావలె హస్తినకు,అయినను పోయిరావలె హస్తినకు ఎన్టీఆర్,పూజాహెగ్డే,సమంత
    పూజా హెగ్డే, రష్మిక మందన సమంత Photo : Twitter


    ఈ సినిమాలో మొన్నటి త్రివిక్రమ్‌కు బాగా కలిసొచ్చిన పూజాహెగ్డేనే హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని టాక్  నడిచింది.  అయితే ప్రస్తుతం ఆ అమ్మడు హిందీ, ఇతర తెలుగు సినిమాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాలో చేసే అవకాశాన్ని వదులుకుందట. దీంతో ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందనను ఎంపిక చేశారని ప్రచారం సాగింది. కాగా తాజా సమాచారం ప్రకారం రష్మిక స్థానంలో సమంత అక్కినేనిని హీరోయిన్‌గా చిత్ర యూనిట్ తీసుకోనున్నారని తెలుస్తోంది. రష్మిక తాజాగా 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆమె పేరే వినిపించినా.. సడన్‌గా సమంత పేరు తెరపైకి వచ్చింది. సమంత గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'అత్తారింటికి దారేది', 'సన్ అఫ్ సత్యమూర్తి', 'అఆ' వంటి చిత్రాల్లో నటించింది. మరోవైపు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ సరసన నటించనుందని సమాచారం.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు